సిటీలో భర్తకు ఉద్యోగం. మంచం మీద ప్రియుడికి ఉద్యోగం ఇచ్చిన భార్య, రాత్రి !
బెంగళూరు: వివాహం చేసుకున్న మహిళ భర్తతో కాపురం చేస్తోంది. భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్న భర్త అతనిపాటికి అతను అతనిపని చేసుకుంటున్నాడు. రాత్రి భర్తతో కాపురం చెయ్యకుండా దూరంగా ఉండటంతో అతని భార్య పగలు ఆమె ప్రియుడితో కాపురం చేస్తోంది. ప్రియుడితో డ్యూటీలు చేస్తున్న భార్య మస్త్ మజా చేస్తోంది. భార్య అసలు మ్యాటర్ చాలా సీక్రేట్ గా నడిపింది. ఇదే సమయంలో ఊహించని విధంగా భర్త దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది.
తమిళనాడులోని తంజావూరులోని కుంభకోణం సమీపంలోని కిల్మందూర్ ప్రాంతంలో సంతాన భారతి అలియాస్ భారతి (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం భారతి దివ్యా అలియాస్ దివ్యజ్యోతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. భారతి. దివ్యా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహం చేసుకున్న తరువాత భారతి అతని భార్య దివ్యాతో చాలా సంతోషంగా కాపురం చేశాడు.

మూడు సంవత్సరాల నుంచి భారతి చెన్నై చేరుకుని ఓ ఫేమస్ హోటల్ లో టీ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే చెన్నై నుంచి ఇంటికి వెళ్లిన భారతి తరువాత కనపడకుండా పోయాడు. తమిళనాడులోని అరియలూరు జిల్లాకు చెందిన భారతి అక్క భర్త సెల్వమణి బందనల్లూరు పోలీస్ స్టేషన్‌లో తన బావమరిది భారతి కనపడటంలేదని ఫిర్యాదు చేశారు.

తన భార్య తమ్ముడు భారతి కనిపించడం లేదనీ, అతని మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యిందని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న బందనల్లూరు పోలీసులు గత కొన్ని రోజులుగా భారతి కోసం గాలిస్తున్నారు. విచారణలో పోలీసులకు భారతి భార్య దివ్యాపై అనుమానం వచ్చింది. పోలీసులు సీక్రేట్ గా దివ్యా మొబైల్ కాల్స్ డేటాను పరిశీలించారు. ఆ సమయంలో దివ్యాకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని తెలుసుకున్న పోలీసులు ఆమెను విచారణకు రావాలని పిలిచారు.
పోలీసుల విచారణలో అక్రమ సంబంధం పెట్టుకున్న దివ్యా ఆమె ప్రియుడితో కలిసి భర్త భారతిని హతమార్చిందని షాకింగ్ సమాచారం బయటకు వచ్చింది. చెన్నైలోని హోటల్ లో భర్త భారతి ఉద్యోగం చేస్తుండగా అతని భార్య దివ్యా, కిల్మండూరుకు చెందిన సతీష్ కుమార్ స్నేహితులుగా మారారని, రానురాను ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
తన భార్య దివ్యా అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న భారతి భార్యతో పాటు ఆమె ప్రియుడు సతీష్ కుమార్ ను హెచ్చరించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇదే విషయంలో భారతి అతని సోదరి భర్త సెల్వమణికి చెప్పి మనస్తాపం చెందాడని, తన జీవితం ఇలా తయారు అవుతుందని తాను ఊహించలేదని భారతి ఆవేదన వ్యక్తం చేశాడని పోలీసులు అన్నారు.
తన అక్రమ సంబంధం గురించి భర్త భారతికి తెలిసిపోయిందని అతని భార్య దివ్యా షాక్ అయ్యింది. తన భర్త భారతిని చంపేస్తే తన ప్రియుడు సతీష్ కుమార్ తో హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉంటుందని దివ్యా ప్లాన్ చేసింది. దీని ప్రకారం 16వ తేదీన భర్త భారతిని ఊరికి రావాలని దివ్యా ఒత్తిడి చేసింది. ఊరికి వచ్చిన భర్త భారతి ఇంట్లోకి రాగానే అప్పటికే ఇంట్లో దాక్కున్న సతీష్ కుమార్‌తో కలిసి దివ్యా కర్రలతో భారతి తలపై దాడి చేశారు.

కిందపడిపోయిన భారతి గొంతుకు తాడుతో బిగించి హత్య చేశారని పోలీసులు అన్నారు. అనంతరం భారతి మృతదేహాన్ని మూటలో కట్టి లోడ్ చేసిన ఆటోలో తీసుకెళ్లి తిరుప్పానందల్ సమీపంలోని పట్టం ప్రాంతంలోని వంతెన దగ్గర పూడ్చిపెట్టినట్లు పోలీసుల విచారణలో దివ్యా అంగీకరించింది. పోలీసులు దివ్యా, ఆమె ప్రియుడు సతీష్ కుమార్ ను అరెస్టు చేశారు. భారతి శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించామని, కేసు విచారణలో ఉందని కుంభకోణం పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications