ఆంటీతో అక్రమ సంబంధం, ఫ్లైఓవర్ కింద భర్త శవం, ప్రియుడికి పాలు, పలావ్, భర్తకు ?

బెంగళూరు/కలబురిగి: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కొంతకాలం క్రితం వరకు చాలా సంతోషంగా కాపురం చేసింది. తరువాత మంచి వయసులో ఉన్న కుర్రాడు చిక్కడంతో భార్య అతని మీద మోజుపడింది. ప్రియుడికి పాలు, పలావ్ ఇస్తున్న భార్య ఆమె భర్తను మాత్రం పస్తులు పెట్టింది. క్లైమాక్స్ లో భర్తను చంపేసిన భార్య, ఆమె ప్రియుడు శవాన్ని ఫ్లైఓవర్ కింద విసిరేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కాలం గడిపేశారు.

భర్త హత్యకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన భార్య సహా ముగ్గురిని కర్ణాటకలోని కలబురిగిలోని ఫర్హతాబా పోలీసులు అరెస్ట్ చేశారు. అరలగుండి గ్రామానికి చెందిన హల్లప్ప ఎంటమన్‌ అలియాస్ హాలప్పను హత్య చేసి మృతదేహాన్ని వంతెన కింద ముళ్ల వాగులో పడేశారు. ఈ హత్య కేసులో హాలప్ప భార్య నీలమ్మ అలియాస్ చంద్రకళ, జీవర్గి తాలూకా బుట్నాల్ గ్రామానికి చెందిన సునీల ఆవరద (28), సునీల హత్తిగూడుర (28) అనే నింితులను పోలీసులు అరెస్టు చేశారు.

illeagalaffair

జూన్ 29న ఇతగా గ్రామం వంతెన కింద ముల్లుకంచెలో 45 నుంచి 50 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు ఫర్హతాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌. చేతన్‌ ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి ఆ శవం ఎవరిది, ఎవరైనా హత్య చేశారా ? అని దర్యాప్తు చేయించారు. ఈ హత్య కేసును దర్యాప్తు చేయడానికి ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు.

ఈ బృందం విచారించగా హాలప్ప అనే వ్యక్తి మూడు నాలుగు రోజులుగా కనిపించకుండా పోయినా అతడి భార్య నీలమ్మ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించలేదని పోలీసుల విచారణలో తేలిసింది. దీంతో అనుమానం వచ్చి నీలమ్మను పోలీసులు ప్రశ్నించారు. నీలమ్మకు సునీల్ తో అక్రమ సంబంధం ఉందని వెలుగు చూసింది.

ప్రియుడు సునీల్ మోజులో పడిపోయిన నీలమ్మ ఆమె భర్త హాలప్పను పూర్తిగా నిర్లక్షం చేస్తూ వచ్చింది. భార్య నీలమ్మ అక్రమ సంబంధం మ్యాటర్ తెలుసుకున్న హాలప్ప అతని భార్యను చితకబాది అక్రమ సంబంధం మానుకోవాలని ఆమెకు వార్నింగ్ ఇచ్చాడని తెలిసింది. ఇదే విషయంలో హాలప్ప, నీలమ్మ దంపతుల మధ్య తేడాలు వచ్చాయి.తన అక్రమ సంబంధానికి తన భర్త హాలప్ప అడ్డుపడుతున్నాడని నీలమ్మ రగిలిపోయింది. ప్రియుడు సునీల్ తో కలిసి హాల్లప్ప హత్యకు అతని భార్య నీలమ్మ కుట్ర పన్నింది.

deadbody21
జూన్ 28న యాడ్రామిలో వెలుతున్న హాలప్పను సునీల్, అతని స్నేహితుడు కారులో కిడ్నాప్ చేసి జీవర్గి తాలూకాలోని వర్చనల్లి సరిహద్దు వాగు దగ్గర తాడుతో గొంతు నులిమి చంపిసి శవాన్ని వంతెన కింద విసిరేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

అనంతరం హాలప్ప మృతదేహాన్ని ఇతగా గ్రామ వంతెన కింద ముళ్ల వాగులో పడేసి హ్యాపీగా వెళ్లిపోయారు. దీనికి సంబంధించి నీలమ్మ, సునీల, సునీల హత్తిగూడురలను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని పోలీసులు అన్నారు. హత్య కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసిన ఫర్హతాబాద్ పోలీస్ స్టేషన్‌ సిబ్బందిని కలబురిగి నగర పోలీస్ కమిషనర్ చేతన్ ప్రశంసించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+