55 ముక్కలుగా నరుకుతా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తను బెదిరించిన మరో భార్య!
సమాజంలో రోజురోజుకి భార్యాభర్తల మధ్య బంధాలు దారుణంగా మారుతున్నాయి. అక్రమ సంబంధాలు భార్యాభర్తల మధ్య అనుబంధాలను బజారుకీడిస్తున్నాయి. మొన్నటికి మొన్న పెళ్లైన మరునాడే తొలిరాత్రి పడక గదిలోకి వెళ్లిన వరుడు ముట్టుకుంటే 35 ముక్కలుగా నరికేస్తా నని వధువు వార్నింగ్ ఇచ్చి, మూడో రోజు రాత్రి గోడ దూకి ప్రియుడితో పరారైన ఘటన మరిచిపోకముందే, తాజాగా మరో ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది.
పబ్జీ ఆడే వ్యక్తితో వివాహేతర సంబంధం
ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఒక ఘటనలో పెళ్లయ్యి , ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్న ఒక యువతి పబ్జి గేమ్ కు బానిసై, తనతోపాటు గేమ్ ఆడే వ్యక్తితో ప్రేమాయణం నడుపుతూ అడ్డొస్తే భర్తను 55 ముక్కలుగా నరుకుతానని బెదిరించిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే..

పెళ్ళయ్యాక పబ్జీ వ్యసనం... ప్రేమలో పడిన యువతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబా లో బాంద్ జిల్లాకు చెందిన ఆరాధన అనే మహిళ 2022లో శీలు అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. వీరికి ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. అయితే ఇంట్లోనే ఉండే సదరు మహిళ పబ్జి ఆటకు అలవాటు పడింది. ఆన్ లైన్ లో తనతోపాటు పబ్జీ ఆడే శివమ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అధి కాస్త ప్రేమ అయింది.
ప్రియురాలి కోసం ఇంటికి వచ్చిన ప్రియుడు.. భర్తకు బెదిరింపు
ఇక భర్త తనను తరచూ వేధిస్తాడని, కొడతాడని శివమ్ కు చెప్పిన ఆరాధన పరిస్థితి అర్థం చేసుకున్న అతను ఏకంగా తనకోసం పంజాబ్ నుండి ఉత్తరప్రదేశ్ కు ఆరాధన ఇంటికి వచ్చాడు.ఊహించని అతిథిగా వచ్చిన అతడిని చూసి ఆరాధన భర్తతోపాటు అతని కుటుంబం షాక్ అయింది. అతన్ని భర్త నిలదీయగా తమ ప్రేమకు అడ్డొస్తే భర్తను 55ముక్కలుగా నరుకుతాను అని మీరట్ మర్డర్ తరహాలో చంపేస్తానని ఆరాధన భర్తను బెదిరించింది.
తాను ప్రియుడితోనే వెళ్తా అంటున్న మహిళ
దీంతో షాక్ కి గురైన ఆరాధన భర్త శీలు శివమ్ ను పోలీసులకు అప్పగించాడు. అతనితో పాటు ఆరాధన కూడా పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భర్త తాగుబోతని, తనను వేధిస్తాడని ఆరోపిస్తూ తాను కూడా శివమ్ తోనే వెళ్లిపోతానని పోలీసుల ముందు చెప్పింది. ఇక దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications