వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిట్టినందుకు భర్త అయిన ఎస్సైని చంపానంటూ ఓ మహిళ లేఖ...!

|
Google Oneindia TeluguNews

హత్యలు చేసిన వారు ఎలా తప్పించుకోవాలా అని స్కెచ్‌లు వేస్తుంటారు. చంపిన తర్వాత కనీసం శవం కూడ దొరకుండా ప్లాన్‌లు వేస్తుంటారు. ఈ నేపథ్యంలో క్రిమినల్స్ తోపాటు తమ భార్య లేదా భర్తలను చంపుతున్న వారు కూడ ఇటివల పెరిగిన పోతున్న పరిస్థితి దాపురించింది... అయితే హరియాణలో ఓ వింత పరిస్థితి చోటుచోటుచేసుకుంది. హంతకులకు విరుద్దంగా ఓ మహిళ తన భర్తను తానే హత్య చేశానని బహిరంగగానే ఒప్పుకుంది. దీంతో తనకు శిక్ష వేయాలని కోరింది ఏకంగా హోంమంత్రి ముందు ఒప్పుకుంది.

 భర్తను చంపానంటూ మంత్రికి లేఖ

భర్తను చంపానంటూ మంత్రికి లేఖ

హరియాణాలోని రాష్ట్ర హోంమంత్రి అనిల్ విజ్‌కు ఈ వింత సంఘటన ఎదురైంది. ఆయన ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న సమయంలో ఒక వితంతు మహిళ ఏడుస్తూ మంత్రి వద్దకు చేరుకుంది. అయితే ఏదో సమస్య ఉందని స్పందించిన సదరు మంత్రి షాక్‌కు గురయ్యారు. దీంతో విచారణలో మహిళ తాను రెండెళ్ల క్రితం తన భర్తను తాను హత్య చేశానని ఓ లేఖను అందించింది. తనకు శిక్ష వేయాలని కోరింది.

తిట్టినందుకు హత్య చేశాను

తిట్టినందుకు హత్య చేశాను

2017, జులై 15న అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ‌గా ఉన్న తన భర్త రోహతస్‌ సింగ్‌ అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడని వితంతువు లేఖలో పేర్కొంది. మద్యం మత్తులో తనను అసభ్యపదజాలంతో దూషించాడని చెప్పింది. మద్యం మత్తులోనే అతను కింద పడిపోయాడు అనంతరం వాంతులు కూడా చేసుకున్నాడని తెలిపింది... ఆ తర్వాత తాను బట్ట ముక్కను అతని నోట్లో కుక్కానని చెప్పింది. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా భర్త మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారని లేఖలో పేర్కొంది....ఇలా తన భర్తను తానే హత్య చేశానని లేఖలో రాసింది.

విచారణ జరుపుతున్న పోలీసులు

అయితే ముందు నమ్మని హోంమంత్రి అనంతరం ఆమె ఇచ్చిన లేఖను తీసుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు ఆమె స్టేట్‌మెంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని, స్థానిక సబ్‌ఇన్స్‌పెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. అయితే ఆమె ఈ హత్య చేసిందా... లేదా అనే అనమానాలు కూడ ఉన్నాయని.. దీంతో సంఘటనపై పూర్తి విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.

English summary
A woman confessed to killing her husband 2 years ago, in a letter she handed to Haryana Home Minister Anil Vij during a 'janta darbar'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X