పట్టపగలు మహిళ దారుణ హత్య, కూతురు ఇంటికి వెళ్లి చూస్తే, ఏం జరిగింది !
చెన్నై/కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరులోని బీలమేడు చేరన్‌మానగర్‌లోని బాలాజీనగర్‌కు చెందిన చక్రవర్తి తన భార్య జగదీశ్వరి (41), కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. అన్నూరులో పెయింటింగ్ కాంట్రాక్ట్ తీసుకుంటుండడంతో చక్రవర్తి ఉదయం పనికి వెళ్లాడు. తరువాత చక్రవర్తి జగదీశ్వరి సాధారణంగా తన కూతురు కార్తీకను ఉదయం స్కూల్లో దించి సాయంత్రం ఇంటికి పిలుచుకుని వస్తుంది.
శుక్రవారం ఉదయం జగదీశ్వరని ఆమె కుమార్తె కార్తీకను స్కూల్ వదిలి ఇంటికి వెళ్లిపోయింది. సాయంత్రం జగదీశ్వరి స్కూల్ దగ్గరకు వస్తుందని ఆమె కుమార్తె కార్తీక స్కూల్ దగ్గర వెయిట్ చేసింది. అయితే సాయంత్రం అయినా జగదీశ్వరి రాకపోవడంతో ఓ టీచర్ జగదీశ్వరకు ఫోన్ చేసింది. అయితే జగదీశ్వరి సెల్ ఫోన్ రిసీవ్ చెయ్యపోవడంతో కార్తీక నడుచుకుంటూ ఇంటికి వెళ్లింది.

కార్తీక ఇంట్లోకి వెళ్లి చూడగా జగదీశ్వరి శవమై కనిపించింది. కార్తీక గట్టిగా కేకలు వెయ్యడంతో అక్కడికి వెళ్లిన ఇరుగుపొరుగు వారు వెంటనే జగదీశ్వరి భర్త చక్రవర్తికి, పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. అసిస్టెంట్ కమిషనర్ పార్థిబన్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపి జగదీశ్వరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పోలీసుల విచారణలో జగదీశ్వరిని గొంతు నులిమి హత్య చేసి 4 సవరన్ గొలుసులు, 1 సవరన్ కమ్మల్ చోరీ చేశారని తేలింది. పోలీసులు స్నిఫర్ డాగ్, ఫోరెన్సిక్ విభాగం అధికారులు జగదీశ్వరని ఇంట్లో ఆధారాలు సేకరించారు. జగదీశ్వరిని హత్య చేసి నగలు అపహరించిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ జగదీశ్వరి నివాసం ఉంటున్న ఇంటి పరిసర ప్రాంతంలోని సీసీ టీవీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. పట్టపగలు నగల కోసం మహిళను హత్య చేసిన ఘటన కోయంబత్తూరులో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications