Wife: భర్తకు గుడ్ బై చెప్పిన భార్య, మాజీ ప్రియుడితో రెండో పెళ్లి, భార్య కళ్ల ముందే అడ్డంగా నరికేశారు !
భార్య అక్రమ సంబంధం దెబ్బకు దంపతులు విడిపోయారు.భర్తను వదిలేసిన భార్య ఆమె మాజీ ప్రియుడిని రెండో పెళ్లి చేసుకుంది.అంతే భార్య కళ్ల ముందే ఆమె రెండో భర్తను సినిమా స్టైల్లో కళ్లల్లో కారం పొడి చల్లి వేట కొడవళ్లతో వెంటాడి నరికి
చెన్నై/తిరువళ్లూరు: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లికి ముందే ప్రేమికులు పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. వివాహం చేసుకుందామని ప్రేమికులు అనుకున్నారు. అయితే పరిస్థితులు రివర్స్ కావడంతో ప్రియరాలు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రియుడికి దూరం అయ్యి వేరే వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ ఓ బిడ్డకు తల్లి అయ్యింది. భర్తతో కాపురం చేస్తున్న మహిళ మాజీ బాయ్ ఫ్రెండ్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త ఊరికే ఉంటాడా ?. దెబ్బకు దంపతులు విడిపోయారు. భర్తను వదిలేసిన భార్య ఆమె మాజీ ప్రియుడిని రెండో పెళ్లి చేసుకుని అతనితో కలిసి ఉంటోంది. షాపింగ్ చేసుకుని రెండో భర్తతో కలిసి ఇంటికి వెలుతోంది. అంతే భార్య కళ్ల ముందే ఆమె రెండో భర్తను సినిమా స్టైల్లో నరికి చంపేశారు.

పెళ్లికి ముందే ప్రేమికులు అడ్వాన్స్ గా ?
తమిళనాడులోని తరువళ్లూరులో రజని (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది, కొన్ని సంవత్సరాల క్రితం రజనికి సుధాచందర్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. సుధాచందర్, రజనిల పరిచయం ప్రేమగా మారింది. ప్రేమికులు నిత్యం కలుసుకుంటూ ఎంజాయ్ చేశారు. పెళ్లికి ముందే ప్రేమికులు అడ్వాన్స్ అయ్యారు.

ప్రియుడికి టాటా చెప్పింది......వేరే వ్యక్తితో పెళ్లి
వివాహం చేసుకుందామని ప్రేమికులు సుధాచందర్, రజని ప్రేమికులు. సుధాచందర్, రజనిల పెళ్లికి ఇరువైపు కుటుంబ సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే పరిస్థితులు రివర్స్ కావడంతో ప్రియరాలు రజని అతని ప్రియుడు సుధాచందర్ కు హ్యాండ్ ఇచ్చింది. తరువాత రజని వసంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రియుడు సుధాచందర్ కు దూరం అయ్యి వసంత్ ను వివాహం చేసుకున్న రజని ఓ బిడ్డకు తల్లి అయ్యింది.

మాజీ ప్రియుడితో అక్రమ సంబంధం
భర్త వసంత్ తో కాపురం చేస్తున్న రజని ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ చందర్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త వసంత్ బయటకు వెళ్లిన తరువాత రజని ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ ను ఇంటికి పిలిపించుకుని అతనితో రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టింది. కొంతకాలం పాటు భార్య రజని అక్రమ సంబంధ: విషయం ఆమె భర్త వసంత్ కు తెలీలేదు. చివరికి భార్య, ఆమె ప్రియుడు చందర్ అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న వసంత్ రగిలిపోయాడు.

రెండు నెలల క్రితం పెళ్లి
భార్యకు బుద్దిమాటలు చెప్పినా ఆమె మాత్రం పద్దతి మార్చుకోకపోవడంతో వసంత్ పెద్దలతో పంచాయితీలు పెట్టాడు. ఎవరు ఎన్ని చెప్పినా రజని మాత్రం పద్దతి మార్చుకోలేదని తెలిసింది. అంతే వసంత్ అతని భార్య రజనికి గుడ్ బై చెప్పాడు. బిడ్డతో కలిసి భర్త వసంత్ కు దూరంగా ఉంటున్న రజని రెండు నెలల క్రితమే ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ చందర్ ను రెండో పెళ్లి చేసుకుంది.

భార్య ముందే రెండో మొగుడు ఫినిష్
చందర్, రజని దంపతులు లక్ష్మీపురంలోని కుమారన్ వీధిలో కాపురం పెట్టారు. రెండో భర్త చందర్ తో కలిసి రజని షాపింగ్ కు వెళ్లింది. చందర్, రజని దంపతులను కొందరు ఫాలో అయ్యారు. షాపింగ్ ముగించుకున్న చందర్ అతని భార్యతో కలిసి ఇంటి దగ్గరకు వెళ్లాడు. భార్య బైక్ దిగి ఇంట్లోకి వెళ్లింది, ఆ సందర్బంలో కొందరు వ్యక్తులు ఆటోలో వెళ్లి బైక్ మీద ఉన్న చందర్ కళ్లల్లో కారం పొడి చల్లేశారు. దిక్కుతెలీక చందర్ కేకలు వేశారు. నిమిషాల్లో గుర్తు తెలియన వ్యక్తులు చందన్ ను ఇష్టం వచ్చినట్లు నరికేశారు. వేటకొడవళ్లతో నరకడంతో చందర్ కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలేశాడు. మహిళ కళ్ల ముందే ఆమె రెండో భర్తను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది,
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications