Bengaluru: నిక్కర్ వేసుకోక ముందు నుంచి పెంచాడు. లిక్కర్ కోసం తాతను వీడు ?
వయసు మీదపడిన తరువాత తనకు తోడుగా ఉంటాడని ఆయన అనుకున్నాడు. అయితే అదే మనుమడి చేతిలో తాను చచ్చిపోతానని ఆయన అస్సలు ఊహించలేకపోయాడు
బెంగళూరు: చిన్నప్పటి నుంచి యువకుడిని అతని తాత పెంచి పెద్ద చేశాడు. వయసు మీదపడిన తరువాత తనకు తోడుగా ఉంటాడని ఆయన అనుకున్నాడు. మనుమడికి అవసరం అయిన సమయంలో కావలసినంత డబ్బులు కూడా ఇచ్చాడు. అయితే అదే మనుమడి చేతిలో తాను చచ్చిపోతానని ఆయన అస్సలు ఊహించలేకపోయాడు.
తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని మనవడు సొంత తాతనే హత్య చేసిన అమానవీయ ఘటన బెంగళూరులోని కమ్మనహళ్లిలో చోటుచేసుకుంది.

మద్య వ్యసనానికి బానిస అయిన యువకుడు డబ్బులు లేకపోయినా, మద్యం తాగలేకపోయినా తట్టుకోలేకపోతున్నాడు. తన సొంత కుటుంబ సభ్యులు, బంధువులు, భార్యా, పిల్లలు అని తేడా లేకుండా తాగుడులో మునిగితేలిపోవాలని తహతహలాడుతున్నాడు.
గతంతో కూడా ఇలాంటి కేసులకు సంబంధించి డబ్బుతో సరిపెట్టుకునేందుకు కుటుంబ సభ్యులపై కూడా తాగుబోతులు దాడికి పాల్పడినట్లు పలు కేసులు నమోదయ్యాయి. అయితే ఇక్కడ తాగుబోతు పీకలదాక తాగేసి ఇంట్లో తాత డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో తాతయ్యను గొంతు నులిమి చంపి అతి పాపిష్టి మనవడు అమానుష దారుణానికి పాల్పడ్డాడు.
బెంగళూరులోని కమ్మనహళ్లిలో జోసఫ్ (58) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు, ఇతనికి ఆంటోని అనే మనుమడు ఉన్నాడు, ఆంటోనికి పెళ్లి అయ్యి భార్య, పిల్లలు ఉన్నారు. వరుసకు తాత అయ్యే జోసఫ్ అతని మనుముడు ఆంటోనిని చిన్నప్పటి నుంచి పెంచి పోసించాడు. జోసఫ్ అన్నింటికి తనకు తోడుగా ఉంటాడని అతని ఇంటిలోనే ఆంటోనిని పెట్టుకున్నాడు.
విపరీతంగా మద్యం తాగడానికి బానిస అయిన ఆంటోని అతని తాతను ప్రతిరోజు డబ్బులు ఇవ్వాలని వేధించాడు. డబ్బులు ఉంటే జోసెఫ్ అతని మనుమడికి ఇచ్చేస్తున్నాడు. అయితే రాత్రి మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన ఆంటోని తనకు మద్యం సేవించడానికి డబ్బులు కావాలని తాత జోసఫ్ ను అడిగాడు. ఆ సమయంలో తన దగ్గర డబ్బులు లేవని జోసఫ్ చెప్పాడు. సహనం కోల్పోయిన ఆంటోని సొంత తాత అని కూడా చూడకుండా జోసెఫ్ ను హత్య చేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడం బెంగళూరులో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications