తల్లితో టచ్ లో ఉన్నాడు. కూతుర్ని పెళ్లి చేసుకోవాలని స్కెచ్, 10 సార్లు పొడిచి !
బెంగళూరు: వివాహం చేసుకున్న మహిళకు ఓ కూతురు ఉంది. భర్తతో కాపురం చేస్తున్న మహిళకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన యువకుడితో వివాహిత మహిళ చనువు పెంచుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో భార్య ఆ యువకుడిని ఇంటికి పిలుపించుకుంటున్నది. అయితే మహిళ కూతురిని ఆమె బాయ్ ఫ్రెండ్ హత్య చెయ్యడం కలకలం రేపింది.
మహారాష్ట్రలోని కల్యాణ్ జిల్లాలోని తీస్ గావ్ ప్రాంతంలో వివాహిత మహిళ నివాసం ఉంటున్నది. మహిళకు 12 ఏళ్ల వయసు ఉన్న కుమార్తె ఉంది. అదే ప్రాంతంలో ఆదిత్య కాంబ్లే (20) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మొదట వివాహిత మహిళతో ఆదిత్య కాంబ్లేకి పరిచయం అయ్యింది. మొదట ఇద్దరూ బయట మాట్లాడుకునేవాళ్లు.

ఇటీవల నీ కూతురిని తనకు ఇచ్చి పెళ్లి చెయ్యాలని, అందరూ ఒక్కటిగా ఉంటామని, తరువాత ఎలాంటి సమస్యలు రావని ఆదిత్య కాంబ్లే వివాహిత మహిళకు చెప్పాడు. అయితే ఆదిత్య కాంబ్లే వ్యవహారం మొత్తం తెలిసిన వివాహిత మహిళ తన సొంత కూతరిని ఆదిత్య కాంబ్లేకి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి నిరాకరించింది.

ఇదే విషయంలో ఆదిత్య కాంబ్లే, వివాహిత మహిళ, ఆమె కూతురి మధ్య వాగ్వివాదం జరుగుతోందని తెలిసింది. రాత్రి మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన ఆదిత్య కాంబ్లే నీకూతురిని ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఆమెకు చెప్పాడు. నీతో నా కూతురి పెళ్లి చెయ్యనని మహిళ తేల్చి చెప్పింది. ఆ సందర్బంలో వివాహిత మహిళ 12 ఏళ్ల కూతురి మీద కత్తితో 10 సార్లు పొడిచేశాడు.
అమ్మాయిని కత్తితో పొడిచిన వెంటనే ఆదిత్య కాంబ్లే మహిళ ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగేశాడు. స్థానికులు అమ్మాయిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణం పోయిందని వైద్యులు చెప్పారు. శాడిస్టు యువకుడు ఆదిత్య కాంబ్లే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, కేసు విచారణలో ఉందని కల్యాణ్ జిల్లా పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications