మెయిన్ రోడ్డులో కత్తితో హంగామా, ప్రతీకారంతో ఏం చేశాడంటే ?, సీసీటీవీల్లో వైరల్ !
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రియురాలిని దారుణంగా కత్తితో పొడిచి, రాళ్లతో కొట్టి చంపారు. ప్రియురాలిని ఆమె ప్రియుడు నడిరోడ్డులో దారుణంగా హత్య చేస్తున్న విషయం సీసీటీవీ కెమెరాల్లో చిక్కింది. ఇప్పుడు మళ్లీ ఓ ఘటన సీసీటీవీ కెమెరాల్లో చిక్కింది. అయితే ఇది వ్యక్తిగత శత్రుత్వమేనని ఓ వ్యక్తి మరో వ్యక్తిని కత్తితో పొడిచాడని వెలుగు చూడటంతో ఢిల్లీ ప్రజలు హడలిపోతున్నారు,
ఈశాన్య ఢిల్లీలో గురువారం రాత్రి ఒక వ్యక్తి బహిరంగంగా ఈ దారుణానికి పాల్పడ్డాడు మరియు తీవ్రంగా గాయపడిన వ్యక్తికి చుట్టుపక్కలవారు ఎలాంటి సహాయం చేయ్యలేదని తెలిసింది. నంద్ నగ్రి ప్రాంతంలో జరిగిన ఆ సంఘటన వీడియో వైరల్ అయ్యింది. ఒక వ్యక్తి రోడ్డుపై కదలకుండా పడుకున్నట్లు వీడియోలో ఉంది. ఓ దుండగుడు పెద్ద కత్తిని చూపిస్తూ చుట్టుపక్కల వారిని బెదిరించాడు.

ఆ తర్వాత ఆ వ్యక్తిని బలవంతంగా కిందకి దింపి ఎడమ మోచేతిపై కత్తితో నరికాడు. ఆ తర్వాత నిందితుడు అక్కడి నుండి అందరిని బెదిరిస్తూ వెళ్లిపోయాడు. అయితే ఆ ప్రాంతంలోని ఎవ్వరూ కత్తిపోట్లకు గురైన వ్యక్తిని రక్షించడానికి ప్రయత్నించలేదని, కనీసం ఆ వ్యక్తిని రక్షించడానికి జోక్యం చేసుకోవడానికి, సహాయం చేయడానికి ప్రయత్నించలేదని వీడియోలో స్పష్టంగా కనపడుతోంది.
కత్తితో దాడి చేసిన వ్యక్తి అక్కడి నుంచి పారిపోయిన తరువాత ఓ మహిళ ఆ వ్యక్తి వద్దకు పరుగెత్తడం, అతనిని పట్టుకుని, తన కొడుకు చంపడానికి ప్రయత్నించారని పదేపదే ఆర్తనాదాలు చేసింది. కొంతసేపటి తరువాత కొందరు అక్కడికి వెళ్లి ఆమెకు సహాయం చెయ్యడానికి ప్రయత్నించారు. గురువారం రాత్రి10:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సీసీటీవీ క్లిప్పింగ్స్ తో తెలుస్తోంది.
Just now sundar nagar Delhi murder pic.twitter.com/5Z7x6F0XbL
— Iftekhar Ahemd (@AhemdIftekhar) June 8, 2023
తీవ్రంగా గాయపడిన ఖాసిమ్ అనే వ్యక్తిని తర్వాత ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించగా అతనికి అక్కడ చికిత్స అందిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఖాసీమ్ మీద దాడి చేసింది అదే ప్రాంతంలో నివాసముంటున్న షోయబ్ అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఖాసీమ్, షోయబ్ ల మధ్య పాత గొడవలు ఉండేవని పోలీసులు తెలిపారు.
రెండేళ్ల క్రితం ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో ఖాసీం, షోయబ్ ల మధ్య పాతక్షలు ఉన్నాయి, గురువారం రాత్రి జరిగిన దాడిలో ఖాసిమ్ ముఖంపై కొట్టి, ముక్కు చెక్కేశాడని, అతని కళ్లు దెబ్బతీశారని, అతని మీద బండరాళ్లు వేశారని పోలీసుల విచారణలో తేలింది. వైద్యుల నివేదిక ప్రకారం ఖాసీఎం ఎడమ చేతి, ఎడమ కాలు, కుడి పాదం, అతని ముఖం మీద తీవ్రగాయాలైనాయని వెలుగు చూసింది. ఖాసీమ్ కు తీవ్రగాయాలు కావడంతో అతను ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేకపోతున్నాడని పోలీసులు తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications