Aalin Sherin Abraham:ప్రభుత్వ లాంఛనాలతో పదేళ్ల పసిపాపకు ముగిసిన అంత్యక్రియలు..!!
జీవితం అంటే కేవలం జీవించడం మాత్రమే కాదు.. మన మరణం తర్వాత కూడా నలుగురిలో బతికి ఉండటం. ఈ సత్యాన్ని పట్టుమని పది నెలల ప్రాయంలోనే ప్రపంచానికి చాటిచెప్పింది కేరళకు చెందిన ఆలిన్ షెరిన్ అబ్రహం. ఆ పసిపాప వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ లోకానికి పెద్ద పాఠాన్ని నేర్పింది. కేరళ రాష్ట్రంలోనే అతి పిన్న వయస్కురాలైన అవయవ దాతగా నిలిచి, మరణంలోనూ మహాత్మురాలు అనిపించుకుంది.
విధి ఆడిన వింత నాటకం
కన్నవారి కళ్లల్లో వెలుగులు నింపుతూ, బుడిబుడి అడుగులతో ఆ ఇల్లంతా సందడి చేయాల్సిన చిన్నారి ఆలిన్ జీవితంలో విధి ఒక చేదు నాటకం ఆడింది. కొన్నేళ్ల పాటు తల్లి గర్భంలో ప్రాణం పోసుకుని, పది నెలల పాటు అమ్మానాన్నల అంతులేని ప్రేమను చవిచూసిన ఆ చిన్నారి, కోటయంలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. కొచ్చిలోని అమృత ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ.. చివరికి ఆ పసిప్రాణం బ్రెయిన్ డెడ్ అయ్యింది.

తమ గుండె కోతను దిగమింగుకుని, తమ బిడ్డ మరొకరి రూపంలోనైనా ఈ లోకంలో ఉండాలని ఆ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం..నేడు నాలుగు కుటుంబాల్లో దీపాలు వెలిగించింది.ఆలిన్ తన కిడ్నీలు,కాలేయం,గుండె వాల్వ్స్, కళ్లను దానం చేసి, నలుగురు చిన్నారులకు సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది.
కన్నీటి వీడ్కోలు.. ప్రభుత్వ అధికారిక లాంఛనాలు
మల్లపల్లిలోని సిఎస్ఐ చర్చిలో ఆలిన్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. ఆ చిన్నారిని చివరిసారి చూసేందుకు ఊరు వాడ కదిలివచ్చింది. కేరళ ప్రభుత్వం ఈ పసి త్యాగమూర్తికి పూర్తి స్థాయి అధికారిక లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికి గౌరవించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆరోగ్య మంత్రి వీణా జార్జ్,సూపర్ స్టార్ మోహన్ లాల్ వంటి ప్రముఖులు ఆలిన్ తల్లిదండ్రులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
#WATCH | Pathanamthitta, Kerala: Final rites of organ donor Aalin Sherin Abraham performed with full state honours. Young Aalin gave new life to five recipients after being declared brain-dead at the hospital. The Infant's liver, two kidneys, heart valve and corneas were donated. pic.twitter.com/gdfHscg56M
— ANI (@ANI) February 15, 2026
విశ్వనటుడు కమల్ హాసన్ భావోద్వేగ లేఖ
ఈ హృదయ విదారక ఘటనపై విశ్వనటుడు కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ రాసిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. ఆ తల్లిదండ్రులను ఓదారుస్తూ ఆయన ఇలా పేర్కొన్నారు:
"మా చిన్నారి ఆలిన్ షెరిన్ అబ్రహం.. నెలల పాటు తల్లి గర్భంలో జీవించింది, పది నెలల పాటు తల్లిదండ్రుల అంతులేని ప్రేమ మధ్య పెరిగింది. ఇప్పుడు ఆమె మరో ఐదుగురు చిన్నారులు మెరుగైన జీవితాన్ని గడిపేలా తోడ్పడింది. మనసుతో, హృదయంతో ఆలోచిస్తే.. మీరే అసలైన ప్రేమగల తల్లిదండ్రులు - ఎప్పటికీ అలాగే ఉండండి. కాలక్రమేణా మీ సంతోషాన్ని మళ్లీ పొందుతారని ఆశిస్తున్నాను. దానికి మీరు నిజంగా అర్హులు." అంటూ ఎక్స్ వేదికగా కమల్ హాసన్ తెలిపారు.
Salute you, Arun Abraham and Sherin Ann John.
— Kamal Haasan (@ikamalhaasan) February 15, 2026
Our baby, Alin Sherin Abraham, lived for months within her mother, and ten months embraced by her parents’ boundless love. Now, she will help five other babies live better lives.
By mindset and by heart, you are - and will always… pic.twitter.com/iXZvlgJqPv
ఆలిన్ షెరిన్ ఇప్పుడు భౌతికంగా మన మధ్య లేదు. కానీ ఆమె ఇచ్చిన అవయవాల ద్వారా మరో నలుగురు చిన్నారుల నవ్వుల్లో తను నిరంతరం జీవిస్తూనే ఉంటుంది. ఆ చిన్నారి త్యాగం ఒక గొప్ప వెలుగై, అవయవదానంపై సమాజంలో నెలకొన్న చీకట్లను పారద్రోలుతోంది. పసిబిడ్డగా రాలిపోయినా.. మరణాన్ని గెలిచిన దేవతగా ఆలిన్ చరిత్రలో నిలిచిపోతుంది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications