గుజరాత్ పై ఆప్ నజర్: అహ్మదాబాద్‌లో తిరంగాయాత్రలో పాల్గొననున్న అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ శనివారం అహ్మదాబాద్లో రోడ్‌షోలో పాల్గొననున్నారు. డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న గుజరాత్ రాష్ట్రంలో వీరిద్దరి రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమం జరగనుంది.

గుజరాత్ పై ఆమ్ ఆద్మీ పార్టీ ఫోకస్

గుజరాత్ పై ఆమ్ ఆద్మీ పార్టీ ఫోకస్

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ రాజకీయాలలో కీలక భూమిక పోషించాలని శరవేగంగా పావులు కదుపుతుంది. పంజాబ్ ఎన్నికల విజయం తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించే పనిలో నిమగ్నమయ్యింది. అందులో భాగంగా గుజరాత్ లో ఆప్ అధినేత, పంజాబ్ సీఎం పర్యటన రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ రాష్ట్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని ప్రకటన చేసింది.

అహ్మదాబాద్ లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరంగా యాత్ర .. పాల్గొననున్న కేజ్రీవాల్, భగవంత్ మాన్

అహ్మదాబాద్ లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరంగా యాత్ర .. పాల్గొననున్న కేజ్రీవాల్, భగవంత్ మాన్

తిరంగా యాత్ర పేరుతో నిర్వహిస్తున్న రెండు కిలోమీటర్ల రోడ్‌షో అహ్మదాబాద్ నగరంలోని నికోల్ మరియు బాపునగర్ ప్రాంతాలను కవర్ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల ముఖ్య నేతలతో సహా దాదాపు 50,000 మంది ప్రజలు ఈ తిరంగా యాత్ర లో పాల్గొంటారని గుజరాత్ ఆప్ ప్రధాన కార్యదర్శి మనోజ్ సొరథియా తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రంలో అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

 ఇటీవల కేజ్రీవాల్ ఇంటి వద్ద విధ్వంసం... గుజరాత్ పర్యటనపై ఆప్ భయం, పోలీసులకు విజ్ఞప్తి

ఇటీవల కేజ్రీవాల్ ఇంటి వద్ద విధ్వంసం... గుజరాత్ పర్యటనపై ఆప్ భయం, పోలీసులకు విజ్ఞప్తి

ఇటీవల ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ నివాసం వెలుపల బీజేవైఎం నిరసనల మధ్య విధ్వంసం చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా గుజరాత్ పర్యటన నేపథ్యంలో వారిద్దరి భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ సంజయ్ శ్రీవాస్తవను ఆమ్ ఆద్మీ పార్టీ కోరింది.ఇటీవల ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసంపై కొందరు దుండగులు దాడి చేశారు. ఇక్కడ కూడా కొంతమంది మా నేతలపై దాడి చేస్తారని మేము భయపడుతున్నాము. కాబట్టి, ఇక్కడ మా నాయకులకు భద్రత కల్పించాలని, వారి పర్యటన పూర్తయ్యేవరకూ మరింత జాగ్రత్త వహించాలని మేము పోలీసు కమిషనర్‌కు లేఖ పంపాము అని సోరథియా విలేకరులతో అన్నారు.

నేడు రాత్రికి అహ్మదాబాద్ చేరుకోనున్న ఆప్ నేతలు .. రేపు, ఎల్లుండి షెడ్యూల్ ఇదే

నేడు రాత్రికి అహ్మదాబాద్ చేరుకోనున్న ఆప్ నేతలు .. రేపు, ఎల్లుండి షెడ్యూల్ ఇదే

పార్టీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, కేజ్రీవాల్ మరియు భగవంత్ మాన్ శుక్రవారం రాత్రికి అహ్మదాబాద్ కు చేరుకుని హోటల్‌లో బస చేస్తారు. శనివారం ఉదయం గాంధీ ఆశ్రమాన్ని సందర్శించి, మధ్యాహ్నం నగరంలోని నికోల్ ప్రాంతానికి చేరుకుని 'తిరంగా యాత్ర'కు నాయకత్వం వహిస్తారు. ఆదివారం, వారు సాయంత్రం తిరిగి ఢిల్లీకి వెళ్లే ముందు షాహిబాగ్ ప్రాంతంలోని స్వామినారాయణ ఆలయాన్ని సందర్శిస్తారని సోరథియా చెప్పారు. మొత్తానికి బిజెపికి పట్టున్న గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల పై దృష్టి సారిస్తున్న వేళ అరవింద్ కేజ్రీవాల్ పర్యటన ఏ విధంగా సాగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+