కాశ్మీర్‌పై ప్రశాంత్: సంబంధం లేదని కేజ్రీవాల్ దిద్దుబాట
న్యూఢిల్లీ: తమ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ కాశ్మీర్ పైన చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం అన్నారు. ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో కేజ్రీవాల్ డామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడ్డారు.
ఇటీవల ప్రశాంత్ భూషణ్ ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాశ్మీర్ లోయలో రెఫరెండం నిర్వహించాలని, వారి భద్రత గురించి ప్రజలే నిర్ణయించుకునే స్వేచ్ఛ ఇవ్వాలని అన్నారు. భూషణ్ వ్యాఖ్యలతో అరవింద్ కేజ్రీవాల్ సోమవారం విభేదించారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అన్నారు.

భూషణ్ వ్యాఖ్యలపై ఎఎపి నేత కుమార్ విశ్వాస్ విలేకరులతో మాట్లాడుతూ.. ఎఎఫి ఏకీకృత భారత్‌ను కోరుకుంటుందని చెప్పారు. ఇది చర్చించాల్సిన అంశం కాదన్నారు. కాశ్మీర్ భారత్‌లోని భాగమేనని చెప్పారు.
దిలీప్ మాట్లాడిన సందర్భం వేరు అయి ఉంటుందని మరో నేత దిలీప్ పాండే చెప్పారు. తన వ్యాఖ్యల పైన ఓ వివరణను ప్రశాంత్ భూషణ్ విడుదల చేశారని చెప్పారు.












Click it and Unblock the Notifications