Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇండియా కూటమి ప్రధాని అభ్యర్ధిగా కేజ్రివాల్ ? ఆప్ లీకులు ! అంతలోనే...

విపక్ష ఇండియా కూటమి మూడో భేటీ రేపు ముంబైలో ప్రారంభం కాబోతోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ భేటీలో ఇండియా కూటమికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కూటమిని ముందుకు నడిపించే నేతలు ఎవరు, వ్యూహాలు, లోగో వంటి అంశాల్ని ఫైనల్ చేయబోతున్నారు. ఇలాంటి సమయంలో ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్ధిగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ సరైన వ్యక్తని ప్రియాంక చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.

ఈ నేపథ్యంలో ఢిల్లీ మంత్రి అతిషి రంగంలోకి దిగారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ప్రధాని అభ్యర్ధి రేసులో లేరని అతిషి తేల్చిచెప్పేశారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్ధిగా కేజ్రివాల్ రేసులో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారం సరికాదని, తాను చెప్పేది అధికారికమని అతిషి చెప్పుకొచ్చారు. అలాగే తాము ఇండియా కూటమిలో చేరింది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, దేశాన్ని రక్షించుకునేందుకే అని అతిషి వెల్లడించారు.

aap hiphops over arvind kejriwals prime minister candidature ahead of INDIA front meet tomorrow

దీంతో ఆప్ అధినేత కేజ్రివాల్ ఇండియా కూటమి ప్రధాని రేసులో లేరని తేలిపోయింది. అయితే ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న ప్రియాంక కక్కర్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారన్న దానిపై చర్చ సాగుతోంది. అంతకు ముందు ప్రియాంక మాట్లాడుతూ కేజ్రివాల్ ఎప్పుడూ లాభదాయకమైన, ప్రజాకర్షక బడ్జెట్లే ప్రవేశపెట్టారని తెలిపారు. ఆప్ అధికార ప్రతినిధిగా ఇండియా కూటమి ప్రధాని అభ్యర్ధిగా ఆయన్ను ప్రతిపాదిస్తున్నానంటూ ప్రియాంక వ్యాఖ్యానించారు. దీంతో ప్రియాంక కామెంట్స్ ఆప్ ను ఇరుకునపెట్టాయి.

రేపు ఇండియా కూటమి ముంబైలో భేటీ అవుతున్న నేపథ్యంలో కేజ్రివాల్ ను ప్రధాని అభ్యర్ధిగా ప్రతిపాదించడంపై ఇతర విపక్షాలు స్పందించేలోపే తిరిగి ఆప్ మంత్రి అతిషి దీనిపై క్లారిటీ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే కేజ్రివాల్ మనసులో ఆ ఆలోచన లేకుండా తన పార్టీ అధికార ప్రతినిధితో ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయిస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే దీనిపై వెంటనే ఫీడ్ బ్యాక్ రావడంతో ఆప్ వెనక్కి తగ్గిందా అన్న చర్చ జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+