సుష్మా స్వరాజ్ ఇంటి ముందు ఆప్ ఆందోళన

న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఇంటిని ముట్టడించడానికి అమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు విఫలయత్నం చేశారు. వెంటనే సుష్మా స్వరాజ్ రాజీనామా చెయ్యాలని ఆప్ కార్యకర్తలు డిమాండ్ చేస్తు భారీ ర్యాలి, ధర్నా నిర్వహించారు.

శనివారం ఉదయం వందలాధి మంది ఆప్ కార్యకర్తలు ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ వీసా వ్యవహారంలో సుష్మా స్వరాజ్ నిబంధనలు గాలికి వదిలి వేశారని ఆరోపించారు. లలిత్ మోదీకి అక్రమంగా వీసా ఇచ్చారని ఆరోపించారు.

AAP protests outside Sushma’s residence in New Delhi

ముందుగానే విషయం తెలుసుకున్న పోలీసులు సుష్మా స్వరాజ్ ఇంటి ముందు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ రహదారిలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆప్ కార్యకర్తలు బ్యారికేడ్లు నెట్టుకుని సుష్మా స్వరాజ్ ఇంటిని ముట్టడించడానికి ప్రయ్నతించారు.

అయితే పోలీసులు వారిని అడ్డుకుని పలువురుని అదుపులోకి తీసుకున్నారు. సుష్మా స్వరాజ్ డౌన్ డౌన్ అంటు ఆప్ కార్యకర్తలు నినాదాలు చేశారు. న్యూయార్క్ లో జరిగే అంతర్జాతీయ యోగా డే ఉత్సవాలలో పాల్గొనడానికి సుష్మా స్వరాజ్ న్యూయార్క్ బయలుదేరి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+