ఆలయ పూజారులకు గౌరవవేతనంగా రూ.18వేలు..!!

ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ భగ్గుమంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ హిందువులను ముఖ్యంగా పూజారులను ఆకట్టుకునేందుకు ఢిల్లీ సర్కార్ మంచి తాయిలాన్ని ప్రకటించింది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే పూజారీ గ్రంథి సమ్మాన్ యోజన పథకం అమలు చేస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని ఆలయ పూజారులకు, గురుద్వారా గ్రంథీలకు గౌరవ వేతనంగా రూ.18వేలను అందజేస్తామని తెలిపారు.

అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఈ ప్రకటనపై మండిపడింది బీజేపీ. ఎన్నికల సమయంలోనే కేజ్రీవాల్‌కు హిందువులు, పూజారులు గుర్తుకువస్తారని మండిపడింది. ఈ క్రమంలోనే ఎక్స్ వేదికగా రుద్రాక్ష, పూలమాలలు,వంటివి ధరించి ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఫోటోను పోస్టు చేస్తూ పచ్చి రాజకీయ అవకాశవాదని రాసుకొచ్చింది. "గత పదేళ్లుగా ఇమాంలకు వేతనం ఇస్తూ, అయోధ్య రామమందిర నిర్మాణంపై అసంతృప్తి వ్యక్తం చేసి, ఆలయాలు, గురుద్వారాలకు సమీపంలోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి,హిందూ వ్యతిరేక రాజకీయాలను నడుపుతూ ఉన్న వ్యక్తికి ఒక్కసారిగా పూజారులు గ్రంథిలు గుర్తుకు వచ్చారు" అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది బీజేపీ."ఆలయాల సందర్శన, పూజారులకు గౌరవ వేతనం ఒక పోల్ జిమ్మిక్ మాత్రమే నిజంగా నాకు వారిపై ఎలాంటి ప్రేమ లేదు" అని అరవింద్ కేజ్రీవాల్ చెబుతున్నట్లుగా బీజేపీ ట్వీట్‌లో సృష్టించింది.

AAP s Outreach to Priests Sparks BJP s Chunavi Hindu Jab at Kejriwal

మంగళవారం రోజున అరవింద్ కేజ్రీవాల్ తన సతీమణి సునీతతో కలిసి ఢిల్లీలోని కశ్మీరీ గేట్ వద్ద ఉన్న మార్ఘాట్ వాలే బాబా ఆలయాన్ని సందర్శించారు.ఎన్నికల హామీల్లో భాగంగా పూజారీ గ్రంథి సమ్మాన్ యోజన పథకం కింద ముందస్తుగానే మార్ఘాట్ వాలే బాబా టెంపుల్ పూజారీ పేరును నమోదు చేయించారు. ఇదే విషయాన్ని ఆయన ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు బీజేపీ శాయశక్తుల ప్రయత్నించిందని మండిపడ్డ కేజ్రీవాల్... దీన్ని అడ్డుకోవచ్చేమోగానీ భక్తుడు భగవంతుడిని కలవాలనుకున్నప్పుడు ఆపడం ఎవరి వల్ల కాదని అన్నారు. తాను ఈ పథకం ప్రకటించినప్పటి నుంచి బీజేపీ తనపై విమర్శలు కురిపిస్తున్నారని, ఈ విమర్శల వల్ల దేశానికి ఏదైనా మేలు చేకూరుతుందా అని ప్రశ్నించారు.

20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, గత 30 ఏళ్లుగా గుజరాత్‌ను పాలిస్తున్న బీజేపీ అక్కడ పూజారులకు గానీ గ్రంథిలకు గానీ గౌరవ వేతనం ఎందుకు ఇవ్వలేకపోయిందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఢిల్లీలో తన ప్రభుత్వం ఇలాంటి పథకం ప్రారంభించి ఆదర్శంగా నిలిచిందన్నారు. తనను విమర్శించడానికి బదులుగా ఆయా రాష్ట్రాల్లో ఇలాంటి పథకాన్ని అమలు చేయాలని కేజ్రీవాల్ బీజేపీకి హితవు పలికారు.2013 నుంచే ఇలాంటి పథకం వివిధ వర్గాల వారికి అమలు చేస్తున్నామని అయితే ఒక మతాధిపతులకు ఇలాంటి పథకం గురించి ఎప్పుడూ ఆలోచన చేయలేదని వివరించిన కేజ్రీవాల్ వీరికోసం ఇప్పుడు అమలు చేస్తున్నామని స్పష్టం చేశార.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+