Abhijeet Dipke: విమానంలోనే అభిజీత్ దిప్కే అరెస్ట్-ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఉద్రిక్తత..!

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీతో పాటు విపక్షాలు, విద్యార్ధి సంఘాలు చేపట్టిన నిరసన కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో నిరసనల్ని అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీ నిరసనకు హాజరయ్యేందుకు వస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దిప్కేను (Abhijeet Dipke)పోలీసులు విమానంలోనే అరెస్టు చేశారు. ఆయనతో పాటు పలువురు సీజేపీ ప్రతినిధుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

'Gyanu, It’s Done Bro’: సీజేపీ, విపక్షాలు, విద్యార్ధుల్ని ఏకం చేస్తున్న ఒకే ఒక్క నినాదం..!
'Gyanu, It’s Done Bro’: సీజేపీ, విపక్షాలు, విద్యార్ధుల్ని ఏకం చేస్తున్న ఒకే ఒక్క నినాదం..!

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించేందుకు కాక్రోచ్ జనతా పార్టీ ఛీఫ్ అభిజీత్ దీప్కే ఉదయం ముంబై నుండి ఢిల్లీకి బయలుదేరారు. ఈ విమానం ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగకముందే అందులోకి పోలీసులు ప్రవేశించారు. జంతర్ మంతర్ వద్ద సీజేపీ తలపెట్టిన నిరసనకు ముందు పోలీసులు విమానంలోకి ప్రవేశించి తనను అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలను దీప్కే తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ప్రసారం చేశారు. తనతో పాటు ఇతర సీజేపీ సభ్యులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను విమానం నుంచే అదుపులోకి తీసుకుంటుండగా, ఢిల్లీ పోలీసు బృందం విమానంలోకి ప్రవేశిస్తున్న దృశ్యాలను చూపిస్తూ దీప్కే ఆ వీడియోను పోస్ట్ చేశారు.

Abhijeet Dipke CJP Members Detained Aboard Plane Ahead of Jantar Mantar Demonstration
Viral Video: శివాజీ పార్క్.. శివాజీ పార్క్.. ఆటో నడుపుతున్న కాక్రోచ్ బాస్ దిప్కే ..!
Viral Video: శివాజీ పార్క్.. శివాజీ పార్క్.. ఆటో నడుపుతున్న కాక్రోచ్ బాస్ దిప్కే ..!


ఈ సందర్బంగా విమానం లోపల గందరగోళం నెలకొన్న దృశ్యాలు కనిపించాయి. తమను విమానం నుంచి దించే వరకు ఎందుకు ఆగలేరని సీజేపీ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము బయటకు వచ్చేవరకు ఆగాల్సిందని, రండి మమ్మల్ని అరెస్టు చేయండి, మేము భయపడమంటూ విమానంలోకి ఎక్కిన మహిళా పోలీసులతో దీప్కే చెప్పారు. అనంతరం విమానం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే అభిజీత్ దిప్కేతో పాటు ఆయన సహచరులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ లను కూడా పోలీసులు ప్రత్యేక బస్సులో పోలీసు స్టేషన్ కు తరలించారు. అంతకుముందు యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, సీజేపీ లీగల్ సెల్ హెడ్ రత్నా సింగ్‌లను కూడా నిరోధించేందుకు వారి ఇళ్ల వద్ద అదుపులోకి తీసుకున్నారు. రాజధానిలోని వివిధ ప్రాంతాల నుండి రాత్రికి రాత్రే 400 మందికి పైగా అనుమానిత నిరసనకారులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందే అనుమతి కోరలేదని పేర్కొంటూ, సీజేపీ నిరసన ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు.

ఈ అరెస్టులను నిరంకుశమైనవిగా కాక్రోచ్ జనతా పార్టీ అభివర్ణించింది. జంతర్ మంతర్ వద్ద తాము తలపెట్టిన నిరసన ప్రదేశానికి తమ నాయకులు చేరుకోకుండా నిరోధించేందుకే పోలీసులు ఈ చర్యను ముందస్తు ప్రణాళికతో తీసుకున్నారని ఆరోపించింది. నాయకుల స్వేచ్ఛా సంచారాన్ని పోలీసులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ, వారిని తక్షణమే, బేషరతుగా విడుదల చేయాలని సీజేపీ డిమాండ్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+