యస్.. నా కంటే ఆమెనే మోర్ టాలెంటెడ్: స్పష్టం చేసిన అభిజిత్ దిప్కే
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో విద్యార్థి సంఘాల ఆందోళనలు హోరెత్తుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఓ ఛాట్.. డిబేట్ కు తెరతీసింది. మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ఎక్స్ పై ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే కేంద్ర బిందువుగా సాగిన ఓ సరదా సంభాషణ ఇది. నెట్టింట వైరల్ అయింది.
అభిజిత్ దిప్కే, నేహా బోరా సామర్థ్యాలను పోల్చుతూ ఓ నెటిజన్ చేసిన పోస్ట్ ఈ చర్చకు దారితీసింది. అభిజీత్ దిప్కే కంటే నేహా బోరా ఎంతో ప్రతిభావంతురాలని, అద్భుతమైన వ్యక్తిత్వంతో నేటి తరం యువతపై ప్రభావం చూపిస్తోన్నారని అమోక్ అనే ఎక్స్ యూజర్ ఓ పోస్ట్ పెట్టారు. అక్టోబర్ 2న దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళన సందర్భంగా అరెస్ట్ అయిన అనంతరం నేహా బోరా పోలీస్ వ్యాన్ ఎక్కుతున్నప్పటి ఓ ఫొటోను దీనికి యాడ్ చేశారు. నేహా బోరా నిఖార్సయిన జెన్ జీ ఐకాన్ అని ఆ యూజర్ అభివర్ణించాడు.

దీనికి అభిజీత్ దిప్కే సానుకూలంగా స్పందించాడు. నేహా బోరా మల్టా టాలెంటెడ్ అనే విషయాన్ని తాను కూడా అంగీకరిస్తోన్నానంటూ రిప్లై ఇచ్చాడా యూజర్ కు. ఈ డిబేట్ ను అబ్జర్వ్ చేసిన నెటిజన్లు ఇద్దరినీ ప్రశంసిస్తోన్నారు. నిజమైన లెజెండ్స్ మాత్రమే ఒకరినొకరు ఇలా గౌరవించుకోగలరని వ్యాఖ్యానించాడు. వీరి మధ్య ఉన్న పరస్పర గౌరవాన్ని అభినందించాడు. నేహా బోరాను ఆడపులిగా అభివర్ణించాడు మరో యూజర్.
నేహా బోర. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విద్యార్థి నాయకురాలు. కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సందర్భంగా ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ సాగుతున్న నిరసనల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓటర్ల జాబితా సవరణలో జరిగిన లోపాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీలో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.
I agree. https://t.co/6q9GZLpMSv
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 3, 2026
అటు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే కూడా ఈ నిరసన కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ముంబైలోని శివాజీ పార్క్ వేదికగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జ్ఞానేష్ కుమార్ తన పదవి నుంచి తప్పుకోకపోతే ఈ నెల 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మరో ధర్నా చేపడతామని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications
