శశిథరూర్ అంశంపై బీజేపీ స్పందన, ఆస్తుల్లేవని ఎంపీ..

న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ పైన కాంగ్రెస్ పార్టీ వేటు వేయడం పైన భారతీయ జనతా పార్టీ సోమవారం స్పందించింది. ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్‌కు శశిథరూర్ మద్దతు తెలపడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోయిందని బీజేపీ కార్యదర్శి సిద్ధార్థ నాథ్ సింగ్ ఆరోపించారు.

ఈ అంశంతో కాంగ్రెస్ పార్టీ ఓర్వలేనితనం బయటపడిందన్నారు. కాంగ్రెస్ పార్టీది సహించలేని గుణమని, ఇప్పుడు శశిథరూర్ ఉదంతంతో అది మరోసారి బయటపడిందన్నారు.

స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేసిన తొమ్మిది మంది పేర్లలో శశిథరూర్ కూడా ఉన్నారని నాథ్ సింగ్ తెలిపారు. ఎవరైనా మోడీకి స్వచ్ఛ భారత్‌కు మద్దతు పలికితే, వారిని తాము క్లీన్ చేస్తామన్న చందంగా కాంగ్రెస్ తీరు ఉందని తెలుస్తోందన్నారు.

Action against Tharoor reflects intolerance: Nath Singh

కాగా, మోడీని ప్రశంసించినందుకు శశి థరూర్‌ను పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి కాంగ్రెసు పార్టీ ఆయనను తొలగించిన విషయం తెలిసిందే. తక్షణమే శశి థరూర్‌ను ఎఐసిసి అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించాలని పార్టీ క్రమశిక్షణా సంఘం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సిపార్సు చేసింది. ఆ సిఫార్సును సోనియా అంగీకరించారు.

'సునందకు భారత్‌లో ఆస్తులు లేవు'

సునంద పుష్కర్ కెనడా పౌరురాలని, ఆమె మృతి చెందే నాటికి సునందకు భారత్‌లో ఎలాంటి ఆస్తులు లేవని, విదేశాల్లోని ఆమె ఆస్తులెన్నో తనకు ఇప్పటికీ తెలియదని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ కేరళ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆమె ఆస్తులు తనకు రాలేదన్నారు.

ఆమె స్థిర, చరాస్తులను వ్యక్తిగతంగానే కాకుండా, ఆమె కొడుకుతోను, మరెవరితోను కలిసి ఆమెకు చెందిన ఆస్తులను తీసుకోలేదని చెప్పారు. కాగా, థరూర్ లోకసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్లో తన భార్య నుండి వారసత్వంగా అందుకున్న ఆస్తులను వెల్లడించలేని కారణంగా ఆయన ఎన్నికను రద్దు చేయాలని బీజేపీ కార్యకర్త ఒకరు పిటిషన్ దాఖలు చేశారు. దీని పైన శశిథరూర్ అఫిడవిట్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+