షాకింగ్: టీవీ లైవ్ షోలో మాట్లాడుతూ కన్నుమూసిన సామాజిక కార్యకర్త
శ్రీనగర్: టీవీ ఛానల్ లైవ్ షోలో ప్రముఖ మహిళా స్కాలర్ గుండె నొప్పి కారణంగా మృతి చెందారు. ఈ విషాధ సంఘటన జమమ్ము కాశ్మీర్‌లో సోమవారం జరిగింది. డోగ్రీ స్కాలర్ కమ్ సామాజిక ఉద్యమకారిణి పేరు రీటా జితేందర్. ఆమె లైవ్ షోలో మాట్లాడుతూనే కన్నుమూశారు.
దూరదర్శన్ ఛానెల్ నిర్వహిస్తున్న ఓ టాక్ షో ప్రత్యక్ష ప్రసారంలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెబుతున్నారు. ఆ సమయంలో మధ్యలో గుండెపోటు వచ్చింది. నిర్వాహకులు స్పందించి రీటాకు ఏమైందో తెలుసుకునే ప్రయత్నం చేసే లోపు మృతి చెందారు.

ఆమె ఆఖరి క్షణాల్లో కుర్చీలో వెనక్కు వాలిపోయిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో చూసిన వారంతా షాకవుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొంటున్నారు. రీటా జితేందర్ గతంలో జమ్ము కాశ్మీర్ భాషా, సాంస్కృతిక అకాడమీకి కార్యదర్శిగా పనిచేశారు.
ఈ ఏడాది జనవరిలో కేరళకు చెందిన ఆర్టిస్ట్ కాళమండలం గీతానందన్ త్రిసూర్ జిల్లాలో గుడిలో ప్రదర్శన చేస్తూ కన్నుమూశారు. గీతానందన్ వయస్సు 58.












Click it and Unblock the Notifications