బుల్లితెర ‘ద్రౌపది’ రూపా గంగూలీ రాజ్యసభ ఎంపీ
న్యూఢిల్లీ: మహాభారత్ టీవీ సీరియల్ లో ద్రౌపది పాత్రధారిగా నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి రూపా గంగూలీ ఇప్పుడు రాజ్యసభ్యురాలు (బీజేపీ) అయ్యారు. బీజేపీ నాయకురాలు అయిన రూపా గంగూలీని ఆపార్టీ రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ చేసింది.
మహాభారత్ ధారావాహికలో ద్రౌపది పాత్రధారిగా రూపా గంగూలీ సుప్రసిద్దురాలు. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సభ్యత్వానికి కేంద్ర ప్రభుత్వం రూపా గంగూలీని ఎంపిక చేసింది.

2015లో బీజేపీలో చేరిన రూపా గంగూలీ పశ్చిమ బెంగాల్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రూపా గంగూలీ పరాజయం చవిచూశారు.
రాజ్యసభ్య సభ్యత్వానికి ఎంపిక చేసిన బీజేపీ నాయకులకు రూపా గంగూలీ ధన్యవాదాలు తెలిపారు. దేశాభివృద్ది కోసం అహర్నిశలు శ్రమిస్తానని ఆమె పేర్కొన్నారు. హిందీ, బెంగాలి, కన్నడ సినిమాల్లో రూపా గంగూలీ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక సంవత్సరాలు పలు టీవీ సీరియల్స్ లో ఆమె నటించారు.












Click it and Unblock the Notifications