నటి జయప్రదకు ఎదురు దెబ్బ, రూల్స్ పాటించని మేడమ్ కు షాక్, జైలు శిక్ష, అయితే !
చెన్నై/ముంబాయి: నటి, రాజ్యసభ మాజీ ఎంపీ జయప్రదకు మద్రాసు హైకోర్టు (High Court) షాక్ ఇచ్చింది. థియేటర్ కాంప్లెక్స్‌లోని కార్మికులకు ఇవ్వాల్సిన ఇఎస్ఐ డబ్బు ఇవ్వకుండా మోసం చేశారని నమోదు అయిన కేసులో నటి, రాజకీయ నాయకురాలు జయప్రదకు (jayaprada) చెక్కెదురు అయ్యింది. ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ (ఇఎస్‌ఐ) నిధిలో తన వాటాను చెల్లించని నటి జయప్రదకు (jayaprada) గతంలో విధించిన ఆరు నెలల శిక్షను రద్దు చేయడానికి మద్రాన్ హైకోర్టు (High Court) నిరాకరించింది.
చెన్నైలోని (chennai) జనరల్ ప్యాటర్స్ రోడ్‌లో జయప్రదకు సొంత సినిమా థియేటర్ ఉంది. నటి జయప్రదకు (jayaprada)చెందిన సినిమా థియేటర్ ను చెన్నైకి (chennai) చెందిన రామ్ కుమార్, రాజాబాబులు నడిపారు. చాలా సంవత్సరాల క్రితం సినిమా థియేటర్ మూతపడింది. కానీ సినిమాహాళ్లలో పనిచేస్తున్న ఉద్యోగుల ఇఎస్‌ఐని మాత్రం విధిగా బదిలీ చేయలేదని నటి జయప్రద (jayaprada), రామ్ కుమార్, రాజాబావుల మీద ఆరోపణలు ఉన్నాయి.
ఆథియేటర్ ఉద్యోగుల ఇఎస్‌ఐ చెల్లించడంలో యాజమాన్యం విఫలమైందని కోర్టుకు (court0 వెళ్లడంతో సమస్య మొదలైంది. దీని ప్రకారం, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జయప్రదతో (jayaprada)పాటు అతని భాగస్వాములు రామ్ కుమార్, రాజాబాబులపై కేసు నమోదు చేసింది. కింది కోర్టులో జయప్రద (jayaprada) తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించడమే కాకుండా ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తానని చెప్పారు.
దీనికి బదులుగా ఈ కేసును కొట్టివేయాలని జయప్రద కోర్టును అభ్యర్థించారు. అయితే నటి జయప్రద (jayaprada)అభ్యర్థనను కోర్టు అంగీకరించలేదు. జయప్రదతో పాటు ఆమె సహచరులకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఆగస్టు 10వ తేదీన కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జైలు శిక్షను రద్దు చేయాలని జయప్రద (jayaprada) మద్రాసు హైకోర్టును (High Court) ఆశ్రయించారు. అయితే మద్రాసు హైకోర్టులో కూడా నటి జయప్రదకు ఎదురుదెబ్బ తగిలింది.

నటి జయప్రద 15 రోజుల్లోగా ఎగ్మూరు కోర్టు మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు (High Court) న్యాయమూర్తి జి. జయచంద్రన్ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాలను పాటిస్తే శిరసావహిస్తే జయప్రదకు బెయిల్ మంజూరు చేయాలని మేజిస్ట్రేట్ కోర్టును మద్రాసు హైకోర్టు (High Court) న్యాయమూర్తి ఆదేశించారు. అలాగే వచ్చే 15 రోజుల్లోగా కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని, బెయిల్ కోసం రూ. 20 లక్షల బాండ్ చెల్లించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది.

రాజకీయాల్లోకి వచ్చిన జయప్రద అంతర్గత విభేదాల కారణంగా తెలుగుదేశం (TDP)వీడి ఎస్పీలో చేరారు. 2004 నుండి 2014 వరకు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యురాలిగా పోటీ చేశారు. నటిగా అనేక సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న జయప్రద (jayaprada) రాజకీయాల్లో ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చివరకి జయప్రద (jayaprada) 2019లో భారతీయ జనతా పార్టీలో (BJP)చేరారు.












Click it and Unblock the Notifications