Actress: నటి సౌజన్యా పీఏ అరెస్టు ?, నాకు సంబంధం లేదంటున్న బాయ్ ఫ్రెండ్, మొబైల్ ఫోన్ లో !
బెంగళూరు/ హైదరాబాద్: కన్నడ టీవీ సీరియల్స్, సినిమా నటి సౌజన్యా అలియాస్ సవి మాదప్ప ఆత్మహత్య చేసుకున్న తరువాత మాయం అయిన ఆమె భాయ్ ఫ్రెండ్ చివరికి మీడియా ముందు ప్రత్యక్షం అయ్యాడు. కన్నడ, తెలుగు టీవీ సీరియల్స్ నటుడు వివేక్ తన కుమార్తెకు టార్చర్ పెట్టడం వలనే ఆమె ఆత్మహత్య చేసుకుందని నటి సౌజన్యా తండ్రి మాదప్ప బెంగళూరులో పోలీసు కేసు పెట్టారు. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్న తన కుమార్తె సౌజన్యా వెంటపడిన ఆ నటుడు తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని, ఆ టార్చర్ తట్టుకోలేని తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని సౌజన్యా అలియాస్ సవి మాదప్ప తండ్రి మాదప్ప బెంగళూరులోని కుంబళగూడు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. సౌజన్యా తండ్రి మాదప్ప చేసిన ఆరోపణలపై సౌజన్యా బాయ్ ఫ్రెండ్, తెలుగు, కన్నడ టీవీ సీరియల్ నటుడు వివేక్ అసలు మ్యాటర్ చెప్పాడు.

నటి ఆత్మహత్యకు తో బాయ్ ఫ్రెండ్ ?
బెంగళూరులోని కుంబలగూడులోని అపార్ట్ మెంట్ లో గురువారం ఉదయం కన్నడ నటి సౌజన్యా ప్రియుడు వివేక్ అపార్ట్ మెంట్ లో ఉన్నారు. తరువాత బయటకు వచ్చి టిఫిన్ తీసుకురావడానికి వివేక్ హోటల్ కు వెళ్లాడు. ప్రియుడు వివేక్ టిఫిన్ తీసుకొని వెళ్లి అపార్ట్ మెంట్ లోకి అడుగుపెట్టి చూడగా నటి సౌజన్యా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది, సౌజన్యా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు వివేక్ అక్కడి నుంచి పరారైనాడని ఆరోపణలు ఉన్నాయి.

ఆత్మహత్య చేసుకోవాలని మానసికంగా సిద్దం అయిన నటి
నటి సౌజన్యా అలియాస్ సవి మాదప్ప సెప్టెంబర్ 27వ తేదీ డెత్ నోట్ రాసిపెట్టిందని పోలీసులు అంటున్నారు. ఆత్మహత్య చేసుకోవాలని నటి సౌజన్యా ముందుగానే నిర్ణయం తీసుకుందని, అందుకే డెత్ నోట్ రాసిపెట్టిందని ఓ సీనియర్ పోలీసు అధికారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోని ఆర్ఆర్ ఆసుపత్రిలో నటి సౌజన్యా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

బాయ్ ఫ్రెండ్, పీఏ సౌజన్యా ఆత్మహత్యకు కారణం
కన్నడ, తెలుగు టీవీ సీరియల్స్ నటుడు వివేక్ తన కుమార్తెకు టార్చర్ పెట్టడం వలనే ఆమె ఆత్మహత్య చేసుకుందని, తన కుమార్తె పీఏ మహేష్ కూడా ఆమె ఆత్మహత్యకు కారణం అయ్యాడని నటి సౌజన్యా తండ్రి మాదప్ప బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్న తన కుమార్తె సౌజన్యా వెంటపడిన నటుడు వివేక్ తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని సౌజన్యా తండ్రి మదప్ప పోలీసులకు చెప్పారు.

నటి సౌజన్యా తండ్రి ఆరోపణు వేరు
తెలుగు, కన్నడ టీవీ సీరియల్ నటుడు వివేక్ టార్చర్ తట్టుకోలేని తన కుమార్తె సౌజన్యా ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి మాదప్ప బెంగళూరులోని కుంబళగూడు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. నటి సౌజన్యా ఆత్మహత్య చేసుకున్న తరువాత ఆమె ప్రియుడు వివేక్ తప్పించుకుని పారిపోవడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఇదే సమయంలో శనివారం సౌజన్యా స్నేహితుడు వివేక్ మీడియా ముందుకు వచ్చాడు.

నాకు ఏమీ సంబంధంలేదు... నాకు ఏమీ తెలీదు
కన్నడ నటి సౌజన్యా ఆత్మహత్య కేసు విచారణ చేస్తున్న పోలీసులు ఆమె పీఏ మహేష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇదే సమయంలో సౌజన్యా బాయ్ ఫ్రెండ్, నటుడు వివేక్ మీడియా ముందుకు వచ్చాడు. సౌజన్యా ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తన కూతురు ఆత్మహత్య చేసుకుందనే భాదతో ఆమె తండ్రి మాదప్ప తన మీద ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటారని అన్నాడు.

నిజానిజాలు బయటకు వస్తాయి
నటి సౌజన్యా ఆత్మహత్యకు కారణం అయిన నిజానిజాలు పోలీసుల విచారణలో బయటకు వస్తాయని, పోలీసులు దర్యాప్తులో బయటకు వచ్చే పూర్తి సమాచారం తెలుసుకోవాలని తాను ఎదురు చూస్తున్నానని ఆమె బాయ్ ఫ్రెండ్ వివేక్ అన్నాడు. సౌజన్యాను వివాహం చేసుకోవాలని తాను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదని, ఆమె మంచి అమ్మాయని, సౌజన్యా ఆత్మహత్య చేసుకుంటుందని తాను అస్సలు ఊహించలేదని వివేక్ అంటున్నాడు.

సహజీవనం విషయంలో క్లారిటీ ఇచ్చిన బాయ్ ఫ్రెండ్
నటి సౌజన్యాతో మీరు సహజీవనం చేస్తున్నారా ? అనే విషయంపై వివేక్ క్లారిటీ ఇచ్చాడు. తాను సౌజన్యా మంచి స్నేహితులు, ఆమెకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు తననను అపార్ట్ మెంట్ కు పిలిపించుకుని ఆ విషయాలు తనతో షేర్ చేసి బాధలు పంచుకుంటుందని వివేక్ అన్నాడు. అయితే సౌజన్యాతో సహజీవనం చేస్తున్నారా అనే విషయంలో పక్కా క్లారిటీ ఇవ్వకుండా వివేక్ గొడమీద దీపం పెట్టినట్లు మాట్లాడటం అనుమానాలకు దారితీస్తోందని కొందరు అంటున్నారు.

మొబైల్ ఫోన్ లో సమాచారం
నటి సౌజన్యా ఆత్మహత్య చేసుకున్న తరువాత ఆమె మొబైల్ ఫోన్ మాయం చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే నటి సౌజన్యా ఎవరెవరితో ఏమి మాట్లాడింది, ఆమెతో ఎవరెవరు టచ్ లో ఉన్నారు ?, ఆత్మహత్య చేసుకునే ముందు రెండు రోజులు సౌజన్యా ఎవరితో ఏమి మాట్లాడింది అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారని తెలిసింది. మొత్తం మీద పోలీసుల అదుపులో ఉన్న నటి సౌజన్యా పీఏ మహేష్ ఏం చెప్పాడు అనే విషయం మాత్రం ఇప్పటి వరకు బయటకురాలేదని కన్నడ మీడియా అంటోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications