Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హత్య కేసులో ప్రముఖ నటి అరెస్ట్.. సీసీటీవీలో రికార్డయిన దారుణం!

Hit And Run Case: అస్సామీ చిత్ర పరిశ్రమలో 'రుద్ర' సినిమాతో విజయం సాధించిన నటి నందిని కశ్యప్ గౌహతిలో జరిగిన ఒక హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ అయ్యారు. నందిని కశ్యప్ ఓ విద్యార్థిని తన కారుతో ఢీకొట్టి అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 21 ఏళ్ల విద్యార్థి మృతి చెందడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఘటన వివరాలు ఇలా..
ఈ దారుణమైన హిట్ అండ్ రన్ ఘటన జులై 25న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గౌహతిలోని దక్షిణగావ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మరణించిన వ్యక్తిని నల్బరి పాలిటెక్నిక్‌లో విద్యార్థిగా చదువుకుంటూ.. గౌహతి మున్సిపల్ కార్పొరేషన్ (GMC)లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్న సామియుల్ హక్ (21) గా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయిన దృశ్యాల ప్రకారం.. ఒక లైటింగ్ ప్రాజెక్టుపై పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా.. వేగంగా వస్తున్న ఒక స్కార్పియో కారు సామియుల్ హక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ కారును నటి నందిన కశ్యప్ స్వయంగా నడుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆమె గాయపడిన విద్యార్థికి సాయం చేయకుండా.. ఘటనాస్థలి నుంచి వేగంగా పారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

Actress Nandini Kashyap Arrested in Hit and Run Case CCTV Footage Reveals Shocking Incident

విద్యార్థి మృతి.. నటి అరెస్ట్
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సామియుల్ హక్‌ను మొదట గౌహతి మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం ఆ తర్వాత ఒక ప్రైవేట్ ఆసుపత్రికి మార్చారు. అయితే తీవ్ర తల గాయాలు, రెండు కాళ్లలో అనేక పగుళ్లు, తొడ, చేయి ఎముకలు విరగడంతో మంగళవారం రాత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. సామియుల్ హక్ సహోద్యోగులు ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని వెంబడించి.. నందిని కశ్యప్ తన ఎస్‌యూవీని దాచడానికి ప్రయత్నించిన కహిలిపారాలోని ఒక అపార్టుమెంట్‌లో కారును గుర్తించారు. ఆ తర్వాత వైరల్ అయిన వీడియోలలో వారికి, నటికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు స్పష్టంగా కనిపించింది.

ప్రారంబంలో పోలీసులు నందిని కశ్యప్ కారును స్వాధీనం చేసుకుని ఆమెను ప్రశ్నించారు. అప్పుడు ఆమె ఈ కేసులో తన ప్రమేయాన్ని నిరాకరించింది. అయితే బాధితుడు మరణించిన తర్వాత కేసులో అభియోగాలు మారిపోయాయి. గౌహతి డీసీపీ(ట్రాఫిక్) జయంత సారధి బోరా మీడియాతో మాట్లాడుతూ.. "హిట్ అండ్ రన్ కేసులో ఈరోజు నటి నందిని కశ్యప్‌ను అరెస్టు చేశాం. గతంలో ఈ కేసు బెయిల్ లభించే సెక్షన్ల కింద నమోదు చేయబడింది. అయితే నిన్న సాయంత్రం గాయాల కారణంగా బాధితుడు మరణించాడు. కాబట్టి హత్య అభియోగాలను చేర్చాం. ఇది నాన్-బెయిలబుల్. మేము ఆమెను అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరుస్తాం" అని వెల్లడించారు.

బాధితుడి కుటుంబం ఆవేదన
మృతి చెందిన సామియుల్ హక్ పేద కుటుంబానికి చెందినవాడు. అతను జీఎంసీలో పార్ట్‌టైం ఉద్యోగం చేసుకుంటూ తన చదువుకు స్వయంగా నిధులు సమకూర్చుకుంటున్నాడు. నందిని కశ్యప్ మొదట సామియుల్ హక్ వైద్య చికిత్సను చూసుకుంటానని హామీ ఇచ్చిందని.. కానీ ఆ తర్వాత సాయం చేసేందుకు ముందుకు రాలేదని అతని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను వేడుకున్నారు. ఈ ఘటన అస్సాంలో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖులు చేసే తప్పులు, నిర్లక్ష్యంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+