వీధికుక్కల కోసం వెక్కి వెక్కి ఏడ్చిన నటి సదా.. షాకిచ్చిన నెటిజన్లు!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీధి కుక్కల పైన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వీధి కుక్కల సమస్య పైన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ, ఎన్ సి ఆర్ వంటి ప్రాంతాలలో కుక్క కాటు కేసులు, రేబీస్ మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ జె.బి.పార్థివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీచేసింది.

వీధి కుక్కలపై సుప్రీం తీర్పు.. భిన్నాభిప్రాయాలు
ఢిల్లీలో ఎక్కడా వీధి కుక్కలు కనబడడానికి వీలులేదని, వీధి కుక్కలను అన్నింటినీ షెల్టర్ లకు తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని వీధి కుక్కలన్నింటినీ ఎనిమిది వారాల్లోగా తొలగించి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెల్టర్‌లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ తీర్పును సమర్థిస్తుండగా, జంతు ప్రేమికులు మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తీవ్రంగా ఖండిస్తున్నారు.

actress sadha cried for street dogs video viral netizens shocked her

Take a Poll

దేశాన్ని చూస్తుంటే సిగ్గుగా ఉంది: నటి సదా
ఈ క్రమంలో, సినీ నటి సదా సుప్రీంకోర్టు ఆదేశాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ 'ఎక్స్'లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. వెక్కివెక్కి ఏడుస్తూ , "సుప్రీంకోర్టు తీర్పు నన్ను లోలోపలే చంపేస్తోంది. మన దేశాన్ని చూస్తుంటే సిగ్గుగా ఉంది. దయచేసి ఈ తీర్పు వెనక్కి తీసుకోండి" అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

వీధికుక్కల మాస్ కిల్లింగ్స్ చూడబోతున్నాం
నగరంలో మూడు లక్షల స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయని, వాటన్నింటికి షెల్టర్లు చూపించే కెపాసిటీ స్థానిక సంస్థలకు లేదని, చివరకు వాటిని చంపేసే పరిస్థితి వస్తుందని నటి సదా వాపోయారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మరో ఏడు ఎనిమిది వారాలలో వీధికుక్కల మాస్ కిల్లింగ్స్ చూడబోతున్నామని నటి సదా ఆవేదన వ్యక్తం చేశారు. స్ట్రీట్ డాగ్స్ కు రాబిస్ రాకుండా వ్యాక్సిన్ ఇవ్వకపోవడం ప్రభుత్వ వైఫల్యం అని పేర్కొన్నారు సదా .

మూగ జీవాలకుసాయం చేసే వారికి ప్రభుత్వ సహకారం లేదు
వాటికోసం బడ్జెట్ కేటాయించి ఎన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, స్థానిక సంస్థలు దీనిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదని ఆరోపించారు. వీధి కుక్కలకు ఆహారం పెట్టడానికి ఏర్పాటు చేయడానికి కొన్ని ఎన్జీవోలు తమ వంతు సాయం అందిస్తూనే ఉన్నాయని సదా అన్నారు. తాను ఎన్నో ఏళ్ల నుండి మూగజీవాలకు సాయం చేస్తున్నానని, కానీ ప్రభుత్వం నుంచి అలాంటివారికి ఎటువంటి సహాయం అందడం లేదని అన్నారు.

అందరూ వాయిస్ వినిపించాలన్న సదా
అంతేకాదు ఇళ్లలో కుక్కలు, పిల్లులు పెంచుకునే వారంతా ముందుకొచ్చి తమ వాయిస్ వినిపించాలని, అలా చేయని వారు జంతు ప్రేమికులు కాదని సదా అన్నారు. ఈ తీర్పుతో తన హృదయం ముక్కలైందని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సదా వీడియో ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
సుప్రీంకోర్టు ఆదేశాలపై సినీ నటి సదా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ తీర్పు పట్ల ఆమె తన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ చేసిన వీడియోను చూసిన నెటిజన్లు మనుషుల ప్రాణాలు పోతే, పసి పిల్లల ప్రాణాలు పోతుంటే ఇదే విధంగా ఎందుకు స్పందించలేదో చెప్పాలంటూ నిలదీస్తున్నారు. మనుషుల కంటే కుక్కల ప్రాణమే ఎక్కువయిందా అంటూ నటి సదా వీడియోను ట్రోల్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+