Adani, Ambani: దేశానికి ఆదానీ, అంబాని అన్నం పెడుతున్నారా ?, మంత్రి సంచలన వ్యాఖ్యలు, ఎవరు ?
దేశానికి అన్నం పెట్టేది అదానీ, అంబానీ కాదని బీజేపీకి చెందిన సీనియర్ మంత్రి బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదానీ, అంబాని ప్రజలకు మూడు పూటల అన్నం పెడుతున్నారా అంటూ మంత్రి ప్రశ్నించారు.
బెంగళూరు/దావణగెరె: బిగ్ షాట్, దేశంలోనే పేరుమోసిన వ్యాపారవేత్త ఆదానీని కాపాడటానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ప్రధాన ప్రతిపక్ష నాయకులు లోక్ సభ సమావేశాల్లో మండిపడుతున్నారు. ఆదానీకి బీజేపీ పెద్దలు అండగా ఉన్నారని స్వయంగా రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే దేశానికి అన్నం పెట్టేది అదానీ, అంబానీ కాదని బీజేపీకి చెందిన సీనియర్ మంత్రి బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదానీ, అంబాని వలన సామాన్య ప్రజలకు సంతోషంగా ఉంటారా ?, ఆదానీ, అంబాని ప్రజలకు మూడు పూటల అన్నం పెడుతున్నారా అంటూ మంత్రి ప్రశ్నించారు. కౌరవుడి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

రైతుల రుణాలు మాఫీ చేస్తే జీవితాలు బాగుపడుతాయా ?
రైతు సమాజాన్ని స్వావలంబన, ఆత్మగౌరవంతో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, రైతుల రుణాలు మాఫీ చేసినంత మాత్రాన వారి జీవితాలు బాగుపడుతాయా అని, పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించినప్పుడే రైతుల జీవితం బంగారు మయం అవుతుందని కర్ణాటక వ్యవసాయ శాఖా మంత్రి, బీజేపీ సీనియర్ నేత బీసీ పాటిల్ అన్నారు. దావణగెరె జిల్లాలోని హరిహర తాలూకాలోని రాజనహళ్లిలో ఏర్పాటు చేసిన రెండు రోజుల వాల్మీకి జాతర ప్రారంభోత్సవంలో మంత్రి బీసీ పాటిల్ మాట్లాడారు.

రైతులకు నూట ఒక్క దండం పెట్టాలి
తాను వ్యవసాయ శాఖ మంత్రి అయిన వెంటనే వ్యవసాయదారుల మొబైల్ ఫోన్‌లలో జై కిసాన్ రింగ్‌టోన్‌ను పెట్టాలని సూచించామని మంత్రి బీసీ పాటిల్ అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు చేతులు ఎత్తి నూట ఒక్క దండాలు పెట్టాలని, రైతులకు ప్రత్యేక గౌరవం ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు తాను ఆదేశాలు జారీ చేశానని మంత్రి బీసీ పాటిల్ చెప్పారు. వ్యవసాయం చాలా ముఖ్యమైనది. గత ఎడాది పంటలు వేయకుంటే తినడానికి మీకు ఏమీ ఉండదని రైతులు బైఠాయించి సత్యాగ్రహం చేశారని, తరువాత రైతులకు గిట్టుబాటు ధర అందించామని మంత్రి బీసీ పాటిల్ గుర్తు చేశారు.

దేశంలో మొదటిసారి మేమే ఆపనిచేశాము
చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లే బోట్లకు ప్రభుత్వం డీజిల్ సబ్సిడీ ఇస్తోంది. రైతులకు డీజిల్ సబ్సిడీ ఇవ్వాలనే ఆలోచన మొదటి నుంచి ఉంది. గత ఫిబ్రవరి 6తో తాను వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తి అయ్యిందని మంత్రీ బీసీ పాటిల్ చెప్పారు. బీఎస్ యడ్యూరప్ప సీఎం కాగానే కరోనా సంక్షోభం వచ్చింది, అప్పుడే రైతులకు సబ్సిడీ ఇద్దామని అనుకున్నామని మంత్రి బీసీ పాటిల్ చెప్పారు. ఒక హెక్టారుకు 20 లీటర్ల డీజిల్ అవసరం. 20 లీటర్ల సబ్సిడీ ఇవ్వాలని కోరారు. ఒకటి నుంచి ఐదు హెక్టార్లకు రూ.1, 250 నేరుగా రైతు ఖాతాలో వేయాలని నిర్ణయించామని, దేశంలో రైతులకు డీజల్ సబ్సిడీలో ఇవ్వడం దేశంలోనే ఇదే ప్రథమమని, ఆ పని కర్ణాటకోని బీజేపీ ప్రభుత్వం చేసిందని మంత్రి బీసీ పాటిల్ గుర్తు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ లక్ష కోట్లు ఇచ్చారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవసాయ సబ్సిడీకి లక్ష కోట్లు కేటాయించారని, ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్, ఆత్మ నిర్భర్ యోజన, ప్రధాన మంత్రి కిసాన్ రు యోజనకు రూ. 15 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారని, రైతులు పండించిన పంటలను ప్రాసెస్ చేసి ఫ్యాక్టరీలలో ప్యాక్ చేసి విక్రయిస్తే ఎక్కువ లాభం వస్తుందని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు మేలు చెయ్యడానికి పని చేస్తోందని కర్ణాటక వ్యవసాయ శాఖా మంత్రి బీసీ. పాటిల్ వివరించారు. రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చడమే మా లక్ష్యం అని, రైతుల రుణమాఫీ చేస్తే వారికి మోక్షం లభించదని, రైతులు ఎక్కువ లాభాలు పొందిన రోజు వారు సంతోషంగా ఉంటారని బీసీ పాటిల్ అన్నారు.

ఆదానీ, అంబాని దేశానికి అన్నం పెడుతున్నారా ?
ప్రముఖ వ్యాపారవేత్తలు అదానీ, అంబానిల విషయంలో కర్ణాటక వ్యవసాయ శాఖా మంత్రి బీసీ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ, అంబాని దేశంలోని ప్రజలకు మూడు పూటలా అన్నం పెట్టడం లేదని అన్నారు. దేశానికి ఆదానీ, అంబాని అన్నం పెడుతున్నారా ? లేదు, మీరు అన్నం పెడుతున్నారని రైతులను ఉద్దేశించి మంత్రి బీసీ పాటిల్ అన్నారు. దేశానికి అన్నం పెడుతున్నది ఇక్కడి రైతులు అని మంత్రి బీసీ పాటిల్ గుర్తు చేశారు, రైతులకు కడుపు మండి పంటలు వెయ్యడం మానేస్తే మన బతుకులు రోడ్డున పడుతాయని, రైతులు కనపడే దేవుళ్లు అంటూ కర్ణాటక వ్యవసాయ శాఖా మంత్రి బీసీ పాటిల్ అన్నారు. మాజీ పోలీసు అధికారి అయిన బీసీ పాటిల్ తరువాత హీరోగా కన్నడలో సూపర్ హిట్ సినిమాలు తీసి తరువాత రాజకీయాల్లోకి వచ్చి నేడు మంత్రి అయ్యారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications