Adani-Mayo Clinic:భారత్‌లో ఆరోగ్య వ్యవస్థ మరో స్థాయికి..అదానీ అంటే ఇదే..!!

భారత కుబేరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ ఛైర్మెన్ గౌతం అదానీ ఓ ముఖ్య ప్రకటన చేశారు. అదానీ హెల్త్ సిటీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో ఆరోగ్యానికి సంబంధించిన సమగ్రమైన క్యాంపస్‌లు ఉంటాయని ప్రకటించారు. అదానీ గ్రూప్‌కు సంబంధించిన లాభాపేక్ష లేని ఆరోగ్య సంరక్షణ విభాగం దీన్ని నిర్వహిస్తుంది.

వరల్డ్ క్లాస్ హెల్త్ సిటీ: మానవ సేవే మాధవ సేవ అని అదానీ బలంగా నమ్ముతారు. దేశంలో నిరుపేదలకు జబ్బు చేసినప్పుడు సరైన చికిత్స అందకనో, లేక చికిత్సకు అయ్యే ఖర్చు భరించలేక చాలా మంది ప్రాణాలు వీడుతున్నారు. ఇది తెలిసి తమకు చేతనైనంత సహాయం చేసేందుకు అదానీ కుటుంబం ముందుకొచ్చింది. వారికి ప్రపంచస్థాయిలో అత్యుత్తమమైన లేదా నాణ్యమైన చికిత్సను అందించేందుకు అదానీ సంస్థ సంకల్పించింది.అంతేకాదు హెల్త్ ఎడ్యుకేషన్‌ను కూడా అందించేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే ముంబై అహ్మదాబాదులో వరల్డ్ క్లాస్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపస్‌లను రూ.6వేల కోట్లతో నిర్మించనుంది. ముందుగా ఈరెండు క్యాంపస్‌లను నిర్మించి ఆ తర్వాత క్రమంగా దేశంలోని నగరాలు, పట్టణాలకు క్యాంపస్‌లను విస్తరించాలనే ఆలోచనతో అదానీ ఉన్నారు.

Adani and Mayo Clinic Join Forces for Cutting-Edge Affordable Healthcare

మెడికల్ కాలేజీలు, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్:ఒక్కో క్యాంపస్‌లో 1000 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలను నిర్మించేందుకు ప్రణాళిక రెడీ చేసింది. ఈ కాలేజీల్లో 150 మెడికల్ సీట్లు, 80కి పైగా రెసిడెంట్ ,40కి పైగా ఫెల్లో సీట్లను తీసుకురానుంది. దీంతో పాటుగా అధునాతన పరికరాలతో పరిశోధన సంస్థలను కూడా నిర్మించనుంది.సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి సేవలందిస్తూ, తర్వాతి తరం వారిని వైద్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అదానీ హెల్త్ క్యాంపస్‌లు పనిచేస్తాయి.క్లినికల్ రీసెర్చ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయోమెడికల్ ఇన్ఫర్మాటిక్స్‌లో కూడా విద్యార్థులకు శిక్షణ ఇస్తారు.

ఇక ఇదంతా సాకారం అయ్యేందుకు అమెరికాలోని మాయో క్లినిక్ గ్లోబల్ కన్సల్టింగ్ (మాయో క్లినిక్)‌తో చర్చలు ప్రారంభించింది అదానీ గ్రూప్.మాయో క్లినిక్‌ నుంచి వ్యూహాత్మకమైన సలహాలు సూచనలు తీసుకోనుంది.డిజిటల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కలయికతో మెరుగైన ఆరోగ్య వ్యవస్థను తీసుకువచ్చేందుకు మాయో క్లినిక్ నిపుణుల గైడెన్స్ తీసుకోనుంది.

అదానీ కుటుంబం ప్రతిజ్ఞ :"రెండేళ్ల క్రితం అంటే నా 60వ పుట్టిన రోజు సందర్భంగా మెరుగైన ఆరోగ్య వ్యవస్థను తీసుకువచ్చేందుకు,నాణ్యమైన విద్య,నైపుణ్యాభివృద్ధి కోసం రూ.60వేల కోట్లు పెట్టుబడి పెడతామని నా కుటుంబం ప్రతిజ్ఞ చేసింది" అని అదానీ గ్రూప్ ఛైర్మెన్ గౌతం అదానీ గుర్తు చేశారు.ఇందులో భాగంగా అదానీ హెల్త్ సిటీతో తొలి అడుగు వేస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో కూడిన వైద్యాన్ని అందిస్తామని చెప్పారు. ఈ తమ ప్రయత్నంలో మాయో క్లినిక్ సలహాలు సూచనలు ఎంతో ఉపయోగపడటంతో పాటు భారత్‌లోని ఆరోగ్య వ్యవస్థను మరో స్థాయికి తీసుకెళతాయనే ఆత్మవిశ్వాసాన్ని అదానీ వ్యక్తం చేశారు.

స్వతంత్ర ఆరోగ్య వ్యవస్థలు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ మాయో క్లినిక్ తన సహాయాసహకారాలను అందించడంలో ముందుంటుంది.క్లయింట్లు తమ లక్ష్యాలను అందుకోవడంలో నిపుణులు సరైన సహాయ సహకారాలను అందిస్తారు.

అదానీ గ్రూపు గురించి: అహ్మదాబాదులో అదానీ గ్రూపు ప్రధాన కార్యాలయం ఉంది.వివిధ వ్యాపారాలను నిర్వహిస్తూ అదానీ గ్రూపు వేగవంతంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా లాజిస్టిక్స్ (నౌకాశ్రయాలు,విమానాశ్రయాలు,షిప్పింగ్, రైల్వే) రంగంలో అదానీ గ్రూపు తనదైన ముద్ర వేసుకుంది. వనరులు, విద్యుత్ ఉత్పత్తి సరఫరా,పునరుత్పాదక శక్తి,గ్యాస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆగ్రో (కమోడిటీస్, వంట నూనె,ఆహార ఉత్పత్తులు,శీతలీకరణ,ధాన్యాల నిల్వ),రియల్ ఎస్టేట్, ప్రజా రవాణా, కన్జ్యూమర్ ఫైనాన్స్, డిఫెన్స్‌తో పాటు ఇతర రంగాల్లో ఆదానీ గ్రూప్ తనదైన మార్క్‌ను క్రియేట్ చేసుకుంది. దేశ నిర్మాణం కోసం, మంచితనంతో కూడిన అభివృద్ధిగా తన సక్సెస్‌ను ఆపాదిస్తారు అదానీ గ్రూప్‌ ఛైర్మెన్ గౌతం అదానీ.సుస్థిరమైన అభివృద్ధి కోసం తమ సంస్థలు పనిచేస్తాయని చెబుతున్నారు.కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (CSR) కార్యక్రమాల ద్వారా ప్రకృతిని పరిరక్షించడంలో అదానీ గ్రూప్ ముందుంటుంది.సుస్థిరత,వైవిధ్యత విలువలతో కూడిన భాగస్వామ్యం అనే సూత్రాలతో అదానీ గ్రూపు పనిచేస్తుంది. అదానీ గ్రూపునకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు www.adani.com అనే వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+