అదానీ అవినీతికి ప్రతీక: కోలార్ ర్యాలీలో రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌లో ఆదివారం నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అదానీ వ్యవహారంలో మోడీపై విమర్శలు చేశారు. అదానీ అవినీతికి సింబల్ అని తీవ్ర ఆరోపణలు చేశారు రాహుల్.
2019లో కోలార్‌లో మోడీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్‌కు రెండేళ్ల జైలు విధించింది కోర్టు. ఈ నేపథ్యంలో రాహుల్ పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఆదివారం కోలార్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జై భారత్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. అదానీ అవినీతిక ప్రతీకగా నిలుస్తున్నారంటూ ఆరోపించారు.

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా అసెంబ్లీ ఎన్నికల కోసం పోరాడుతుండటం సంతోషంగా ఉందన్నారు రాహుల్ గాంధీ. మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు రాహుల్.
తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జరిగే తొలి కేబినెట్ సమావేశం దాని కీలక ఎన్నికల హామీలను ఆమోదిస్తుందని, వాటి అమలుకు మార్గం సుగమం చేస్తుందని రాహుల్ అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే , కర్ణాటక ఇన్‌చార్జి జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సూర్జేవాలా, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, శాసనసభా పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులు బహిరంగ సభలో పాల్గొన్నారు.
2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్‌లోని కోర్టు మార్చి 23న రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత, ఈ రాహుల్ లోక్‌సభకు అనర్హత వేటుకు గురయ్యారు. 2019 ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలార్‌లో రాహుల్ మోడీ పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications