చరిత్ర సృష్టించిన అదానీ.. ప్రపంచంలోనే మొట్టమొదటి స్టీల్ స్లాగ్ రోడ్డు ప్రారంభం
పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను ఉపయోగించి అదానీ పోర్ట్స్ సంస్థ అద్భుతం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి స్టీల్ స్లాగ్ రోడ్డును ప్రారంభించింది. పారిశ్రామిక వ్యర్థాలను ఉపయోగించి ఈ ఘనత సాధించింది అదానీ సంస్థ. హజీరా పోర్టులో 1.1 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును నిర్మించింది.
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్(APSEZ) అద్భుతం చేసింది. పారిశ్రామిక వ్యర్థాలను ఉపయోగించి రీసైక్లింగ్ విధానంలో హజీరా పోర్టులో ప్రపంచంలోనే మొట్టమొదటి స్టీల్ స్లాగ్ రోడ్డును ప్రారంభించింది. హజీరా పోర్టులో 1.1 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ రోడ్డు మల్టీ-పర్పస్ బెర్త్ (MPB-1)ను బొగ్గు యార్డ్ కు కలుపుతుంది. ఈ రీసైక్లింగ్ విధానంతో సర్క్యులర్ ఎకానమీ సూత్రాలకు అనుగుణంగా భారత్ లాజిస్టిక్స్ రంగాన్ని మెరుగుపరుస్తుందని అదానీ అభిప్రాయపడింది.
ఈ రోడ్డును నీతిఆయోగ్ సభ్యులు డాక్టర్. విజయ్ కుమార్ సారస్వత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఐఆర్ డీజీ కైలాశ్ షెల్వి, సీఎస్ఐఆర్ డైరెక్టర్ డాక్టర్ మనోరంజన్ పరిడా తోపాటు అదానీ పోర్ట్స్ అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ ను బల్క్, జనరల్ కార్గో టెర్మినల్ (BGCT) విస్తరణలోని ఫేజ్-IIలో భాగంగా నిర్మించారు. CSIR-CRRI టెక్నాలజీ సహకారంతో ఈ ప్రాజెక్టును సంయుక్తంగా అభివృద్ధి చేశారు.

ఈ రోడ్డు భారత్ లో మూడో స్టీల్ స్లాగ్ రోడ్డు కావడం విశేషం. అయితే ప్రపంచంలోనే పోర్టు లోపల నిర్మించిన మొట్టమొదటి స్టీల్ స్లాగ్ రోడ్డుగా ఇది నిలిచింది. ఈ విధానంతో APSEZ భారత్ లోని మౌలిక వ్యవస్థల్ని మరింత పటిష్టం చేస్తోంది. దేశ వాజిజ్య రంగాన్ని పటిష్టం చేసేందుకు APSEZ తన వంతు కృషి చేస్తోంది.












Click it and Unblock the Notifications