ప్రజాస్వామ్యం ఎందుకింకా?: ఆ పార్టీలో అంతా రాజకీయ వారసత్వమే!

భారత రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు ఎంత లోతుగా పాతుకపోయాయో పేర్కొంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ ఒక సంచలన నివేదికను విడుదల చేశాయి. దేశంలోని మొత్తం 5,204 మంది ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో 21 శాతం(1,107 ) మందికి వారసత్వ రాజకీయ నేపథ్యం ఉండడం గమనార్హం. ఈ లెక్కలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కుటుంబ పాలన నిర్మాణ స్వభావాన్ని స్పష్టంగా చూపుతున్నాయి.

లోక్‌సభలో అధిక వారసత్వ ప్రభావం
జాతీయ స్థాయిలో వారసత్వ ప్రభావం ఎక్కువగా ఉందని ఈ నివేదిక తేల్చింది. ముఖ్యంగా లోక్‌సభలో ఈ సంఖ్య అత్యధికంగా 31 శాతంగా ఉంది.య ఇక రాష్ట్రాల విషయానికి వస్తే.. రాష్ట్ర శాసనసభల్లో 20 శాతం, రాజ్యసభలో 21 శాతం, శాసన మండలిలలో 22 శాతం మంది ప్రతినిధులు వారసత్వ రాజకీయాల వారసులేనని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.

ADR Report 21 of Indian Legislators are from Political Dynasties

పార్టీల వారీగా వారసత్వ ప్రతినిధుల సంఖ్య
ఈ రిపోర్టు జాతీయ, ప్రాంతీయ పార్టీలలో వారసత్వ రాజకీయాల వ్యాప్తిని వివరించింది.

జాతీయ పార్టీలు: జాతీయ పార్టీలకు చెందిన 3,214 మంది ప్రతినిధులలో 20 శాతం (657 మంది) వారసత్వ నాయకులే కావడం గమనార్హం. ఇందులో కాంగ్రెస్ పార్టీలో ఈ నిష్పత్తి అత్యధికంగా 32 శాతంగా ఉంది. దీని తర్వాత బీజేపీలో 18 శాతం, సీపీఐ(ఎం)లో అత్యల్పంగా 8 శాతం వారసత్వ నాయకులు ఉన్నారు.

ప్రాంతీయ పార్టీలు: ప్రాంతీయ పార్టీలలో వారసత్వ రాజకీయాలు మరింత లోతుగా పాతుకుపోయాయి. ఎన్సీపీ (శరద్ పవార్), జేకేఎన్సీ(జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్)లో ఏకంగా 42 శాతం వారసత్వ నాయకులు ఉన్నారు. వైఎస్సార్సీపీలో 38 శాతం, టీడీపీలో 36 శాతం మంది ఉన్నారు. అయితే, తృణమూల్ కాంగ్రెస్లో 10 శాతం, ఏఐఏడీఎంకేలో 4 శాతం మాత్రమే వారసత్వ నాయకులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

రాష్ట్రాల వారీగా వారసత్వ రాజకీయాలు ఇలా..
రాష్ట్రాల వారీగా చూసినప్పుడు కొన్ని రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాల ప్రభావం చాలా ఎక్కువగా ఉందని తేలింది.

సంఖ్య పరంగా: ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 141 మంది వారసత్వ ప్రతినిధులు ఉన్నారు (మొత్తం 604 మందిలో 23 శాతం). ఆ తర్వాత మహారాష్ట్రలో 129 మంది (32 శాతం), బీహార్‌లో 96 మంది (27 శాతం), కర్ణాటకలో 94 మంది (29 శాతం) ఉన్నారు.

నిష్పత్తి పరంగా: నిష్పత్తి పరంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 255 మందిలో 86 మంది (34 శాతం) వారసత్వ ప్రతినిధులు ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర (32%), కర్ణాటక (29%) ఉన్నాయి.తమిళనాడు (15 శాతం), పశ్చిమ బెంగాల్ (9శాతం) వంటి పెద్ద రాష్ట్రాలలో బలమైన పార్టీ వ్యవస్థల కారణంగా వారసత్వ రాజకీయాలు తక్కువగా ఉన్నాయని నివేదిక విశ్లేషించింది.

మహిళా ప్రతినిధుల్లో రెట్టింపు వారసత్వం
ఈ నివేదికలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం లింగ ఆధారిత గణాంకాలు. పురుష ప్రతినిధులలో 18 శాతం మంది వారసత్వ రాజకీయాల వారసులు కాగా.. మహిళా ప్రతినిధులలో ఈ సంఖ్య 47 శాతంగా ఉంది, ఇది దాదాపు రెట్టింపు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో 69 శాతం మంది మహిళా ప్రతినిధులు వారసత్వ నాయకులేనని తేలింది. బీహార్‌లో 57 శాతం, తెలంగాణలో 64 శాతం మంది మహిళా ప్రతినిధులు రాజకీయ వారసత్వ నేపథ్యం నుంచి వచ్చారు.

పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ఈ గణాంకాలు తక్కువగా ఉన్నాయి(మహిళల్లో 28 శాతం, పురుషుల్లో 5శాతం). ఇది అక్కడ రాజకీయాలు కుటుంబ-కేంద్రీకృతం కాదని సూచిస్తోంది. ఈ నివేదిక భారత ప్రజాస్వామ్యంలో వారసత్వ రాజకీయాల వ్యాప్తిపై తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+