వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5రాష్ట్రాలు: మోడీ ప్రభావంపై అద్వానీ, అసంతృప్తితోనేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Advani evades giving Modi credit for poll results
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయంలో గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభావంపై ఆ పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ బుధవారం స్పందించారు. మోడీ ప్రభావం కాదన్నట్లుగా ఆయన మాట్లాడారు.

విజయంలో మోడీ ప్రభావం ఉందా అని విలేకరులు ప్రశ్నించగా.. ఈ విజయం అందరిదని, ముఖ్యంగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులదని చెప్పారు.

అద్వానీ పార్లమెంటు కాంప్లెక్సులో బుధవారం మాటలాడారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లు రాష్ట్రాలను బాగా అభివృద్ధి చేశారన్నారు.

రమణ్ సింగ్, శివ్‌రాజ్ సింగ్ చౌహాన్‌లు బాగా కష్టపడ్డారని, వారికి పార్టీ పార్లమెంటరీ బోర్డులో స్థానం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని అద్వానీ తెలిపారు. కాగా, అద్వానీ వ్యాఖ్యల ద్వారా మోడీ పట్ల ఆయన ఇంకా అసంతృప్తిగా ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

మరోవైపు, కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయాన్ని విలేఖరులు ప్రస్తావించగా, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అవిశ్వాస తీర్మానం చర్చకు రానీయకుండా అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాయని అద్వానీ అన్నారు.

English summary
BJP leader LK Advani on Wednesday evaded giving his party's prime ministerial candidate Narendra Modi credit for the good showing by the BJP in the recently concluded assembly elections, and lauded the chief ministers instead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X