రూ.1470కే విమానం టికెట్.. ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్
టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా ఒక శుభవార్తను వినిపించింది. ఇప్పటి నుంచి 96 గంటలపాటు.. అంటే ఆదివారం అర్థరాత్రి వరకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నవారికి కన్వీనియెన్స్ ఫీజు ఉండదని ప్రకటించింది.నాలుగురోజులపాటు ఈ స్పెషల్ సేల్ నిర్వహిస్తున్నారు. టికెట్లను వెబ్ సైట్, యాప్ ద్వారా బుక్ చేసుకోవాలి.
ఈ ఆఫర్ పొందడానికి కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీ లోపు జరిగే ప్రయాణాలకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఎంపిక చేసిన దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో బుక్ చేసుకునే టికెట్లకు సంబంధించి మాత్రమే తగ్గింపు వర్తిస్తుంది.

సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు చేసే విమాన ప్రయాణ టికెట్స్ ను ఆదివారంలోగా, ఆగస్ట్ 20వతేదీ లోపు ఎయిర్ ఇండియా వెబ్ సైట్ నుంచి కానీ, మొబైల్ యాప్ నుంచి కానీ బుక్ చేస్తేనే ఈ కన్వీనియెన్స్ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. లిమిటెడ్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఎంపిక చేసిన డొమెస్టిక్ మార్గాల్లో ఈ అమ్మకాల ద్వారా బుక్ చేసే టికెట్ ధర ఎకానమీ క్లాస్ లో రూ. 1470 నుంచి ప్రారంభమవుతుంది. బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ. 10,130 నుంచి ప్రారంభమవుతుంది. వివిధ దేశాలకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాల్లోనూ అత్యంత చవకగానే టికెట్ రేట్లు ఉన్నాయి. గురువారం నుంచి ఆదివారం అర్ధరాత్రి 12.00 గంటల వరకు.. అంటే 96 గంటల పాటు ఈ సేల్ ఉండనుంది.












Click it and Unblock the Notifications