నాగ్‌పూర్‌లో అక్రమంగా నివాసం: ఇప్పుడు ఆప్ఘాన్ తాలిబన్లతో తుపాకీతో నూర్ మహ్మద్ ప్రత్యక్షం
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పదేళ్లపాటు అక్రమంగా నివసించిన ఓ వ్యక్తి.. ఆప్గానిస్థాన్‌లోని తాలిబన్లతో కలిసి ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది. అతడు తుపాకీ పట్టుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆప్ఘానిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. అక్కడ అరాచక పాలనను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
మహారాష్ట్రంలోని నాగ్‌పూర్‌లో అక్రమంగా నివసిస్తున్న ఆప్ఘాన్ పౌరుడైన నూర్ మహ్మద్ అజీజ్ మహ్మద్‌ను దేశం నుంచి బహిష్కరించారు. దీంతో అతడు తిరిగి ఆప్ఘాన్ వెళ్లి తాలిబన్లలో కలిసిపోయాడు. నూర్ మహ్మద్ గత పదేళ్లు నాగ్‌పూర్‌లోని దిఘోరీలో అక్రమంగా నివసించాడు. నిఘా వర్గాల సమాచారం మేరకు అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఏడాది జూన్ 23న ఆప్ఘానిస్థాన్ పంపించేశారు.

కాగా, ఇప్పుడు నూర్ మహ్మద్ తుపాకీ పట్టుకుని తాలిబన్లతో కలిసిన ఫొటో ఒకటి వెలుగులోకి రావడంతో అంతా షాకయ్యారు. ఆప్ఘాన్ వెళ్లిన అనంతరం నూర్ మహ్మద్ తాలిబన్లతో కలిసిపోయి ఉండొచ్చని నాగ్‌పూర్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.
2010లో ఆరు నెలల పర్యాటక వీసాపై నాగ్‌పూర్ వచ్చాడనే విషయం అంతకుముందు దర్యాప్తులో తేలిందన్నారు. శరణార్థిగా గుర్తించాలని అతడు వేసిన దరఖాస్తు, అప్పీలును ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం తిరస్కరించింది. అప్పట్నుంచి అక్రమంగా నాగ్‌పూర్‌లోనే ఉన్నాడని సదరు అధికారి తెలిపారు.

నూర్ అసలు పేరు అబ్దుల్ హకీ అని, అతడి సోదరుడు ఎప్పట్నుంచో తాలిబన్లతో కలిసి పనిచేస్తున్నట్లు మరో అధికారి వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న సమయంలో నూర్ ఎడమ భుజంలో బుల్లెట్ గాయాలను గుర్తించామని పోలీసులు తెలిపారు. కాగా, సోషల్ మీడియాలో పలువురు ఉగ్రవాదులను నూర్ మహ్మద్ అనుసరించినట్లు పోలీసు అధికారి తెలిపారు.
ఇది ఇలావుండగా, ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు మొదలయ్యాయి. దేశ పౌరులపైనే కాల్పులు జరుపుతూ తమ పైశాచికాన్ని చాటుకుంటున్నారు. దేశ పౌరులకు, ఇతరు దేశస్తులకు హాని కలిగించమని, ఆప్ఘనిస్థాన్ ఇతర దేశాలకు వ్యతిరేకంగా పనిచేయదని ఇటీవల పేర్కొన్న తాలిబన్లు.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో అరాచకాన్ని సృష్టిస్తూ మానవ హక్కులను హరిస్తున్నారు.
తాలిబన్ల అరాచకాలను ముందే ఊహించిన విదేశాలకు చెందిన రాయబార కార్యాలయాలను ఆయా దేశాలు మూసివేశాయి. భారత్, అమెరికా ఇలా చాలా దేశాలు తమ దౌత్య కార్యాలయాలను మూసివేసి, సిబ్బందిని స్వదేశాలకు రప్పించుకున్నాయి. ఇతర దేశాలతో స్నేహాన్ని కొనసాగిస్తామని చెప్పిన తాలిబన్లు.. తాజాగా, విదేశీ రాయబార కార్యాలయాల్లో దాడులు చేస్తున్నాయి. కీలక పత్రాలుంటే తీసుకెళ్తున్నాయి.
ఆప్ఘాన్‌లోని కాందహార్, హెరాత్ నగరాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాల్లో గత బుధవారం తాలిబన్లు తనిఖీలు నిర్వహించినట్లు తెలిసిందని భారత ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. కీలక పత్రాలు ఏమైనా దొరుకుతాయోనని వారు ఇలా చేసివుంటారని తెలుస్తోంది. అక్కడ ఎలాంటి పత్రాలు లభించకపోవడంతో ఆ కాన్సులేట్ వద్ద ఉన్న వాహనాలను తాలిబన్లు తీసుకెళ్లారు.
ఇక జలాలబాద్, కాబూల్‌లో ఉన్న కాన్సులేట్, ఎంబసీల్లో తాలిబన్లు సోదాలు చేశారా? లేదా అన్నదానిపై స్పష్టత రాలేదు. గత ఆదివారం కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు ఆప్ఘాన్‌లో తమ రాజ్యం మొదలైందనే సంకేతాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఆప్ఘాన్‌లోని తమ దౌత్య సిబ్బందిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి తీసుకొచ్చింది. ఇంకా మిగిలి ఉన్న భారతీయులను కూడా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
కాగా, ఆప్ఘనిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకు మరింతగా దిగజారుతున్నాయి. ఆప్ఘాన్ ప్రజలకు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు దూరమవుతున్నాయి. దీంతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఆగస్టు 19న స్వాతంత్ర్య వేడుకలను జరుపుకునేందుకు రోడ్లపైకి జాతీయ జెండాలతో వచ్చిన పౌరులపై తాలిబన్లు కాల్పులతో విరుచుకుపడ్డారు. దీంతో పలువురు మృతి చెందారు. అనేక మంది గాయాలపాలయ్యారు. ఈ క్రమంలో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు.
-
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications