వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రాన్స్‌ప్లాంటేషన్: ఆప్గన్ మిలటరీ కెప్టెన్‌కి ఓ భారతీయుడి చేతులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆప్గనిస్ధాన్ సైన్యంలో అబ్ధుల్ రహీమ్ కెప్టెన్‌గా సేవలందిస్తూ ప్రమాదంలో తన రెండు చేతులూ పొగొట్టుకున్నాడు. తాజాగా అబ్దుల్ రహీమ్‌కి ఓ భారతీయుడు తన రెండు చేతులను దానం చేశాడు.

మూడు సంవత్సరాల క్రితం కాందహార్ సమీపంలో ల్యాండ్ మైన్స్ తొలగిస్తున్న సమయంలో అవి పేలడంతో అబ్దుల్ రహీమ్ (30) తన రెండు చేతులనూ పొగొట్టుకున్నాడు. తిరిగి తన చేతులను అమర్చుకోవాలన్న కోరికతో ఎన్నో దేశాలు తిరిగాడు.

Afghan Military Captain Gets Indian Hands in Transplant

అలా చివరికి కొచ్చిలోని అమృతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను సంప్రదించాడు. దీంతో బ్రెయిన్ డెడ్ అయిన 54 ఏళ్ల వ్యక్తి చేతులను అబ్దుల్‌కు అమర్చడంలో విజయవంతమయ్యారు. సుమారు 20 మంది వైద్యులు, 8 మంది అనస్ధీషియన్లు 15 గంటలపాటు శ్రమించి చేతులను అమర్చారు.

దీంతో అవయవాల ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న తొలి ఆఫ్గనిస్ధాన్ జాతీయుడిగా అబ్దుల్ రహీమ్ నిలిచాడు. ఆపరేషన్ అనంతరం అతని రెండు చేతులూ స్పందిస్తున్నాయి. మరో 10 నెలలు పాటు ఫిజియోథెరపీ చేయించుకుంటే పూర్తిస్ధాయిలో పనిచేస్తాయని ఆపరేశషన్ చేసిన వైద్యులు తెలిపారు.

English summary
A 30-year-old Afghan military captain from Kandahar, who lost his hands while defusing mines in the war torn country, now has two Indian hands - thanks to a successful transplant carried out at an institute in Kochi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X