Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆఫ్ఘనిస్థాన్ లో క్లిష్ట పరిస్థితి, వారి తరలింపే ప్రధాన కర్తవ్యం : అఖిలపక్ష భేటీలో మంత్రి జై శంకర్

ఆఫ్ఘనిస్థాన్ లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఆగస్టు 31వ తేదీ లోపు ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులందరిని తరలించడం తక్షణం వున్న ప్రధాన కర్తవ్యమని ప్రతిపక్ష పార్టీలకు తెలియజేశారు. విదేశాంగ మంత్రి జై శంకర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ సహా ఇతర ప్రధాన పార్టీల నేతలు హాజరయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతీయ తరలింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు విపక్ష నేతలకు ఈ సమావేశంలో తెలియజేశారు .

భారతీయుల తరలింపు ప్రధాన ప్రాధాన్యత

భారతీయుల తరలింపు ప్రధాన ప్రాధాన్యత

ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు రోజురోజుకూ దారుణంగా మారుతున్నాయని, ఆఫ్ఘనిస్తాన్ నుండి తమను తరలించాలని సహాయం కోసం దాదాపు 15,000 మంది ప్రజలు ప్రభుత్వాన్ని సంప్రదించారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. తరలింపుకు యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నామని చెప్పారు . ఇదే సమయంలో అమెరికా, రష్యా మరియు చైనా వంటి ఇతర దేశాలు తీసుకుంటున్న తరలింపు చర్యల గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విపక్షాలకు వివరించారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి సాధ్యమైనంత ఎక్కువ మందిని తరలించడానికి భారతదేశం ప్రయత్నిస్తోందని, మంత్రి జైశంకర్ చెప్పినట్లు సమాచారం. భారతీయులను తరలించడం "ప్రధాన ప్రాధాన్యత" అని ఆయన విపక్ష నేతలకు నొక్కి చెప్పినట్లు తెలుస్తుంది.

ఆఫ్ఘన్ ప్రజలతో దీర్ఘకాలిక స్నేహం ఆశిస్తున్నాం అన్న విదేశాంగ మంత్రి

ఆఫ్ఘన్ ప్రజలతో దీర్ఘకాలిక స్నేహం ఆశిస్తున్నాం అన్న విదేశాంగ మంత్రి

చాలా క్లిష్ట పరిస్థితులలో, ముఖ్యంగా విమానాశ్రయంలో తరలింపు కార్యకలాపాలను చేపట్టామని ఆయన చెప్పారు. మా తక్షణ ఆందోళన , మాకు ఉన్న ముఖ్యమైన పని ముందు అక్కడి నుండి భారత్ కు రావలసిన వారిని తరలించటమే అని వెల్లడించారు. ఇక తమ దీర్ఘకాలిక ఆసక్తి ఆఫ్ఘన్ ప్రజల స్నేహం అని సమావేశం తర్వాత మిస్టర్ జైశంకర్ ట్వీట్ చేశారు. కాబూల్‌ని ఆక్రమించిన కొన్ని వారాల్లో అమెరికా మరియు దాని మిత్రదేశాలకు దోహాలో ఇచ్చిన వాగ్దానాలను తాలిబన్లు ఉల్లంఘించారని ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులకు చెప్పినట్లు కూడా వర్గాలు తెలిపాయి. గత వారం కాబూల్‌పై తాలిబన్లు నియంత్రణలోకి రాకముందే అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామాకు బదులుగా రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించిందని, మారుతున్న తాలిబన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చర్చలు ప్రారంభించినట్లు చెప్పారు.

సమావేశానికి హాజరైంది వీరే

సమావేశానికి హాజరైంది వీరే

ఈ సమావేశానికి జైశంకర్‌తో పాటు, కేంద్ర మంత్రి మరియు రాజ్యసభ ఎంపీ పీయూష్ గోయల్ మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. అంతేకాదు ఈ రోజు అఖిలపక్ష సమావేశానికి హాజరైన వారిలో ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్, డిఎంకె టిఆర్ బాలు మరియు మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ వంటి కాంగ్రెస్ నాయకులు, మల్లికార్జున్ ఖర్గే (రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు) మరియు అధిర్ రంజన్ చౌదరి (లోక్‌సభలో పార్టీ చీఫ్) ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మిధున్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నుండి గల్లా జయదేవ్, టిఆర్ఎస్ పార్టీ నుండి నామా నాగేశ్వరరావు సైతం ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభంపై నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్నారు కాబూల్ నుండి రోజుకు రెండు విమానాలు నడపడానికి అనుమతించబడిన భారతదేశం, ఇప్పటివరకు 300 మంది పౌరులను భారతదేశానికి తరలించింది. ఇతర దేశాల నుండి కూడా ఇదే సంఖ్యలో పౌరులు కూడా తిరిగి తీసుకురాబడ్డారు.

 కాబూల్ విమానాశ్రయం చుట్టూ అస్థిర పరిస్థితులు .. తరలింపుపై ఆందోళన

కాబూల్ విమానాశ్రయం చుట్టూ అస్థిర పరిస్థితులు .. తరలింపుపై ఆందోళన

ఏదేమైనా, కాబూల్‌లోని విమానాశ్రయం మరియు చుట్టుపక్కల ఉన్న అస్థిర భద్రతా పరిస్థితుల కారణంగా తరలింపు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. దీని నియంత్రణ ఆక్రమిత తాలిబన్ దళాలు మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య విభజించబడింది. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాన సవాలు విమానాశ్రయం యొక్క కార్యాచరణ స్థితి అని ఆయన పేర్కొన్నారు. కొంతమంది భారతీయులు కాబూల్‌కి వచ్చినప్పుడు నమోదు చేసుకోకపోవడం వల్ల వారిని గుర్తించడం కష్టంగా మారడంతో తరలింపు కూడా ప్రభావితం అవుతుందని వెల్లడించారు.

 కాబూల్ నుండి తరలింపు ప్రక్రియ ఎలా సాగుతుందో వివరించిన జై శంకర్

కాబూల్ నుండి తరలింపు ప్రక్రియ ఎలా సాగుతుందో వివరించిన జై శంకర్

కాబూల్ నుండి గత బ్యాచ్ తరలింపు విమానాలు ఆదివారం భారతదేశంలో ల్యాండ్ అయ్యాయి . ఆ విమానాలలో 107 మంది భారతీయ పౌరులతో సహా 168 మంది ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ విమానంలో ఇండియా కు చేరుకున్నారు. కాబూల్‌లోని గురుద్వారాలో శరణార్థులుగా ఉన్న కొంతమంది భారతీయ సిక్కులను కూడా తరలింపుదారులలో చేర్చారు. ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఉన్న ఒక ఆఫ్ఘన్ మహిళ తన ఆరోగ్య స్థితి క్షీణిస్తోందని, తాలిబాన్లు తన ఇంటిని తగలబెట్టారని అక్కడి పరిస్థితులను చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. ఎయిర్ ఇండియా, ఇండిగో మరియు విస్తారా నిర్వహిస్తున్న మూడు ఇతర విమానాలలో కూడా భారతీయులు ప్రయాణించారు. కొన్ని విమాన మార్గాల్లో భద్రతా సమస్యల కారణంగా ఈ విమానాలు తజికిస్తాన్ మరియు ఖతార్ మీదుగా ప్రయాణాలు సాగించాయి.

కాబూల్ విమానాశ్రయం దగ్గర దారుణ పరిస్థితులు

కాబూల్ విమానాశ్రయం దగ్గర దారుణ పరిస్థితులు

ఆగస్టు 17 న, ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించడాన్ని పర్యవేక్షించడానికి భద్రతపై కేబినెట్ కమిటీ సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పారిపోయిన తరువాత తాలిబన్ల బృందం ఎటువంటి వ్యతిరేకత లేకుండా కాబూల్‌లోకి ప్రవేశించి ఆఫ్ఘనిస్థాన్ ను తమ నియంత్రణలోకి తీసుకొచ్చారు. అప్పటి నుండి కాబూల్ విమానాశ్రయంలో వేలాది మంది దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటికే వేలాది సంఖ్యలో ప్రజలు కాబూల్ విమానాశ్రయం ముందు బారులు తీరారు. మురికికాల్వల్లో దిగి యూఎస్ దళాలకు తమను తరలించాలని ప్రాదేయపడుతున్నారు . ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల నియంత్రణలోకి వచ్చిన దేశం వదిలి పారిపోయే క్రమంలో ఎయిర్ పోర్ట్ లో జరిగిన తొక్కిసలాటలో 20 మంది మరణించారు. ఇక నిత్యం తాలిబన్ల అరాచకాలకు ఎంతో మంది బలైపోతున్నారు. అక్కడ పరిస్థితిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+