చైనా నుంచి పుట్టుకొచ్చిన మరో ఫ్లూ: పందుల నుంచి విస్తరిస్తోన్న కొత్త వైరస్: ఈ రెండు రాష్ట్రాలపై పడగ
గువాహటి: ప్రపంచాన్ని చుట్టబెట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన చైనాలో మరో సరికొత్త ఫ్లూ వెలుగులోకి వచ్చింది. దీని దుష్ప్రభావం భారత్ కంటే మనదేశంలోనే అధికంగా కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది..వేలాది పందులను బలి తీసుకుంది. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూగా నిర్ధారించారు అధికారులు. అకారణంగా పందులు మరణించడం పట్ల అధికారులు ఆరా తీయగా.. దీనికి కారణం ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కారణమని తేలింది. భారత్‌తో సరిహద్దులను పంచుకుంటోన్న ప్రావిన్స్‌లో పుట్టుకొచ్చిన ఈ ఫ్లూ.. మనదేశంలోని రెండు రాష్ట్రాల్లో విస్తరించింది.
Recommended Video

అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలల్లో..
ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ తీవ్రత ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలపై తీవ్రంగా పడింది. ఒక్క అస్సాంలోనే 2500కు పైగా పందులు ఈ ఫ్లూ ధాటికి మరణించాయి. 306 గ్రామాల్లో 2500లకు పైగా పందులు మరణించినట్లు అస్సాం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఫ్లూను నివారించడానికి లేాదా పందులను సంరక్షించడానికి అవసరమైన వ్యాక్సిన్ ఏదీ ప్రస్తుతానికి అందుబాటులో లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం అస్సాంలో 30 లక్షలకు పైగా పందులు ఉన్నట్లు అంచనా. ఈ ఫ్లూ విస్తరించడమంటూ జరిగితే.. వాటి మనుగడ కష్టమౌతుందనే ఆందోళన వ్యక్తమౌతోంది.

చైనా నుంచి అరుణాచల్ ప్రదేశ్‌కు..
చైనా నుంచి అరుణాచల్ ప్రదేశ్‌కు ఈ వైరస్ విస్తరించి ఉంటుందనే అనుమానాలను అస్సాం ప్రభుత్వం వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్.. చైనా సరిహద్దులను ఆనుకుని ఉంటుంది. చైనాలోని గ్ఝీజాంగ్ ప్రావిన్స్‌తో సరిహద్దులను పంచుకుంటోంది ఈ రాష్ట్రం. గత ఏడాది ఏప్రిల్‌లో తొలిసారిగా ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ జాడ తొలిసారిగా వెలుగు చూసింది కూడా ఈ ప్రావిన్స్‌లోనే. అక్కడి నుంచి ఈ వైరస్ విస్తరించి ఉంటుందని అస్సాం ప్రభుత్వం అంచనా వేస్తోంది.

అరుణాచల్‌లో పోర్క్ బిజినెస్ ఉద్యోగి మృతి
అరుణాచల్ ప్రదేశ్‌లో పోర్క్ బిజినెస్ చేస్తోన్న ఓ వ్యాపారికి చెందిన 230 పందులు కొన్ని రోజుల వ్యవధిలో మరణించాయని, వాటి పెంపకాన్ని చూసుకునే ఉద్యోగి ఒకరు చనిపోయారని అస్సాం పశు సంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా వెల్లడించారు. ఫలితంగా ఈ ఫ్లూ వల్ల మనుషులు కూడా అప్రమత్తంగానే ఉండాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటికే తాము అరుణాచల్ ప్రదేశ్‌తో దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నట్లు తెలిపారు.

కరోనాకు సంబంధం లేదు..
కరోనా వైరస్‌కు ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెప్ (ఎన్ఐహెచ్ఎస్ఏడీ) స్పష్టం చేసినట్లు మంత్రి అతుల్ బోరా తెలిపారు. అయినప్పటికీ.. అప్రమత్తంగా ఉండక తప్పదని అన్నారు. ఫ్లూ బారిన పడిన పందులన్నీ మరణించాయని, వాటిని సంరక్షించడానికి అసవరమైన వ్యాక్సిన్ ప్రస్తుతానికి అందుబాటులో లేదని అన్నారు. ప్రస్తుతానికి 306 గ్రామాల్లో మాత్రమే ఈ వైరస్ తీవ్రత అధికంగా ఉందని, దీన్ని విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నట్లు చెప్పారు.
-
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్‌లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు..












Click it and Unblock the Notifications