మైనర్ రేప్- 30 ఏళ్ల తర్వాత తల్లి రేపిస్టుల్ని పట్టించిన కొడుకు..ఎలాగో తెలుసా ?
30 ఏళ్ల క్రితం ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై ఇద్దరు నిందితులు అత్యాచారం చేశారు. ఆ తర్వాత దాన్ని పదే పదే కొనసాగించారు. దీంతో ఆమె ఏడాదిలోనే నెలతప్పింది. ఓ బిడ్డకు సైతం జన్మనిచ్చింది. అయితే ఈ అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు మాత్రం అప్పటి నుంచి తప్పించుకుంటూనే ఉన్నారు. వారిని గుర్తించి చట్టం ముందు నిలబెట్టే పరిస్ధితి లేకపోవడంతో ఆ తల్లి 30 ఏళ్లుగా పోరాడుతూనే ఉంది. చివరికి తనకు పుట్టిన కుమారుడి సాయంతో ఆ నిందితుల్ని పట్టుకోలగలిగింది.
ఈ నెల 11న ఉత్తర్ ప్రదేశ్ లోని సవిత అనే 42 ఏళ్ల మహిళకు తన లాయర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. యూపీ పోలీసులు తనపై 30 ఏళ్ల క్రితం వరుసగా అత్యాచారాలకు పాల్పడిన ఇద్దరిని పట్టుకుని అరెస్టు చేసారనేది ఆ కాల్ సారాంశం. తన జీవితాన్ని నాశనం చేసిన ఆ ఇద్దరు మృగాళ్లు దొరికారన్న సంతోషం ఓవైపు, ఇన్నాళ్లు తాను ఎదుర్కొన్న అవమానాలు మరోవైపు.. ఇలా మిశ్రమ అనుభూతులతో ఆ మహిళ ఉద్వేగానికి గురైంది. అప్పట్లో ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకుంది.

తాను 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఓ సాయంత్రం సైకిల్ తొక్కుతుండగా.. ఇద్దరు వ్యక్తులు చూశారు. మన ఏరియాకు ఓ కొత్త పక్షి వచ్చిందని మాట్లాడుకోవడం ఆమెకు వినిపించింది. వారిద్దరి పేర్లు రజీ, హసన్. వారిద్దరి వయస్సు 20, 22 ఏళ్లు. ఓ వేసవి మధ్యాహ్నం తాను ఇంటి దగ్గరే ఉంది. టీచర్ గా పనిచేస్తున్న తన అక్క స్కూలుకు వెళ్లిపోయింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన తన బావ కూడా ఆఫీసుకు వెళ్లిపోయాడు. అదే సమయంలో ఇద్దరు నిందితులు గోడ దూకి తన ఇంట్లోకి ప్రవేశించారు. తనపై 45 నిమిషాల పాటు అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తన అక్కను చంపేస్తామన్నారు. ఆ తర్వాత ఆరునెలల పాటు ఇదే బెదిరింపుతో వరుసగా రావడం, అత్యాచారం చేయడం పరిపాటిగా మారింది. తీవ్ర అనారోగ్యానికి గురైన తనను అక్క ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ పరీక్షించిన డాక్టర్లు గర్భవతిగా తేల్చారు. అంతా షాకయ్యారు.
జరిగిన విషయాన్ని సవిత తన అక్క, బావకు చెప్పేసింది. దీంతో వారు రజీ, హసన్ వాళ్ల తల్లితండ్రులకు చెప్పినా వారు నమ్మలేదు. చివరికి రజీ, హసన్ ఓ రాత్రి సవిత వాళ్ల ఇంటికి వచ్చి అక్క, బావపై దాడి చేశారు, ఇల్లు కాల్చేస్తామని బెదిరించారు. దీంతో వారు రాత్రికి రాత్రే వేరే ఊరు వెళ్లిపోయారు. చివరికి ఆరునెలల తర్వాత సవిత బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డను వేరు చేసి ఎవరికో ఇచ్చేశారు. ఆ తర్వాత తన అక్క, బావ కూడా ఇదే కారణంతో విడిపోయారు. ఆ తర్వాత ఆమె తిరిగి స్కూల్లో చేరింది. 18 ఏళ్లు దాటాక పెళ్లి చేసుకుంది. అయితే భర్త మాత్రం చదువుకు సహకరించలేదు. వీరిద్దరికీ ఓ బాబు పుట్టాడు. జీవితం గాడిన పడింది. ఓ రోజు తన భర్తకు తన గతం గురించి తెలిసిపోయింది. అప్పట్లో పుట్టిన బిడ్డ వచ్చి నా ఆస్తి అడిగితే ఎలా అని భర్త సవితను ప్రశ్నించాడు. చివరికి సవితను తన కుమారుడితో కలిపి బయటికి పంపేశాడు. తిరిగి రోడ్డుపై పడిన సవిత చిన్నా చితకా పనులు చేసుకుంటూ కొడుకుని పోషిస్తోంది.
సీన్ కట్ చేస్తే ఓ రోజు తన ఇంటికి ఓ 13 ఏళ్ల బాలుడు వచ్చాడు. తలుపు కొట్టగానే తీసిన సవిత ఎవరని అడిగితే తన కొడుకని చెప్పాడు. తాను పుట్టగానే సవిత వాళ్ల బంధువులకు పెంచుకోమని ఇచ్చేసారు. అయితే వాళ్లు సవతి ప్రేమ చూపడంతో ఇబ్బందులు పడి చివరికి తన తల్లిని చేరాడు. అలా ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటోంది. పెరిగి పెద్దయిన తన తొలి కుమారుడు రాజు గతాన్ని ప్రశ్నించాడు. అతనికి గతం గురించి చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేద్దామన్నాడు. చివరకు పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. నిందితుల్ని గుర్తించేందుకు రాజు డీఎన్ఏ సాయం తీసుకున్నారు. ఎట్టకేలకు నిందితుల్ని అరెస్టు చేసి చట్టం ముందు నిలబెట్టారు.












Click it and Unblock the Notifications