• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మేము కూడా ఇష్టమైన వారిని వివాహం చేసుకునేలా చట్టం రావాలి: తొలి ట్రాన్స్ జెండర్ అధికారి ఐశ్వర్య

|

ఒడిషా: స్వలింగ సంపర్కం నేరంకాదని చెబుతూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఒడిషాకు చెందిన తొలి ట్రాన్స్ జెండర్ గెజిటెడ్ అధికారి ఐశ్వర్య రూతుపర్ణ ప్రధాన్ తనతో సహజీవనం చేస్తున్న మరో ట్రాన్స్‌జెండర్‌ను వివాహం చేసుకోనుంది. సెప్టెంబర్ 6న ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 377‌ను కొట్టివేసింది సుప్రీం కోర్టు. దీంతో LGBTQల హక్కులను పరిరక్షిస్తూ తీర్పు వెలువరించింది. ఇక ఒకే లింగానికి చెందిన వ్యక్తులు పెళ్లి చేసుకునేందుకు కూడా సుప్రీం కోర్టు ఆమోద ముద్ర వేయాలని ఐశ్వర్య చెప్పారు. అంతేకాదు వారికి వారసత్వంగా వచ్చే ఆస్తులు సమాన హక్కులకింద వచ్చేలా చూడాలని ట్రాన్స్ జెండర్ ఐశ్వర్య డిమాండ్ చేసింది.

కోరుకున్న వారిని పెళ్లి చేసుకునేలా సుప్రీం కొత్త వివాహ చట్టం తీసుకురావాలి

కోరుకున్న వారిని పెళ్లి చేసుకునేలా సుప్రీం కొత్త వివాహ చట్టం తీసుకురావాలి

సమాజంలో వివాహమంటే స్త్రీ పురుషుల మధ్యే జరగాలనే భావన ఉంది. తమలాంటి పౌరుల్లో సాధికారిత తెచ్చేందుకు కోర్టులు ప్రయత్నించాలని ఐశ్వర్య కోరారు. తాము ప్రేమించిన మగవారిని వివాహమాడేందుకు తమలాంటి వారిలో సాధికారిత తీసుకురావాలని ఆమె కోర్టులను కోరారు. అయితే త్వరలో ఈ హక్కులు కూడా అత్యున్నత న్యాయస్థానం తమకు కల్పిస్తుందన్న ఆశాభావం ఐశ్యర్య వ్యక్తం చేశారు. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ నుంచి ఒడిషా తొలి రాష్ట్ర సివిల్ అధికారిగా ఐశ్వర్య ఎంపికయ్యారు.

  గే సెక్స్ నేరం కాదు : సుప్రీం కోర్టు సంచలన తీర్పు
  ఐశ్వర్య రూతుపర్ణ ప్రధాన్‌గా మారిన రతికాంత ప్రధాన్

  ఐశ్వర్య రూతుపర్ణ ప్రధాన్‌గా మారిన రతికాంత ప్రధాన్

  రతికాంత ప్రధాన్ .... ఐశ్యర్యగా రూతుపర్ణ ప్రధాన్‌గా మారి 2010లో ఒడిషా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో విజయం సాధించి పారదీప్‌లో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. 2014 ఏప్రిల్ 15న ట్రాన్స్ జెండర్స్‌ను థర్డ్ జెండర్ క్యాటగిరీగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది.వారికి రాజ్యాంగం కల్పించే అన్ని హక్కులూ వర్తిస్తాయని పేర్కొంది. థర్డ్ జెండర్‌గా మారాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు ఐశ్వర్య తెలిపింది. ఇదే విషయాన్ని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు పేర్కొంది. గతేడాది మాత్రమే తాను అన్ని రికార్డుల్లో అధికారికంగా ట్రాన్స్‌జెండర్‌గా గుర్తింపు పొందినట్లు తెలిపింది ఐశ్వర్య.

  గే సెక్స్ నేరం కాదు: స్వలింగ సంపర్కంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

  ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఉంది

  ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఉంది

  ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక వివాహ చట్టం తీసుకొస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నట్లు ఐశ్వర్య చెప్పారు. తనకు ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నట్లు చెప్పిన ఐశ్వర్య త్వరలోనే తామిద్దరు వివాహం చేసుకుంటామనే ఆలోచన తమలో ఎంతో ఆనందం కలిగిస్తుందని అది నిజం కావాలని కోరుకుంటున్నట్లు ఐశ్వర్య తెలిపారు. సుప్రీంకోర్టు కొత్త వివాహం చట్టం తీసుకొస్తుందనే ఆశ కూడా తమలో ఉందని ఐశ్వర్య తెలిపింది. తను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఒక సంతోషకరమైన కుటుంబ జీవనాన్ని గడపాలనుకుంటున్నట్లు ఐశ్వర్య చెప్పారు. వివాహం తర్వాత ఒక అనాథ శరణాలయం నుంచి ఒక బిడ్డను దత్తత తీసుకునేందుకు తీర్మానం చేసుకున్నట్లు ఐశ్వర్య చెప్పారు.

   ట్రాన్స్ జెండర్ అని ఎప్పుడూ ఇబ్బంది పడలేదు

  ట్రాన్స్ జెండర్ అని ఎప్పుడూ ఇబ్బంది పడలేదు

  ఒడిషా కంధమాల్ జిల్లా కనబగిరి గ్రామానికి చెందిన ఐశ్వర్య పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎమ్‌ఏ పూర్తి చేశారు. అంతేకాదు ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ నుంచి పీజీ డిప్లొమా చేశారు. తన తండ్రి ఆర్మీలో పనిచేశారు. ఓ జాతీయ బ్యాంకులో క్లర్క్‌గా పనిచేయక ముందు ఓ జాతీయ పత్రికలో ఇంటర్న్‌షిప్ చేశారు. ఆ తర్వాత రాష్ట్ర సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి అందులో విజయవంతం అయ్యారు. తన విధులను నిర్వర్తించే సమయంలో తనకు ట్రాన్స్ జెండర్ అయినందువల్ల ఎక్కడా ఇబ్బందులు ఎదుర్కోలేదని ఆమె తెలిపారు. ప్రజలు కూడా తన పనితనంతో సంతృప్తితో ఉన్నట్లు ఐశ్వర్య తెలిపారు. తనను ఎంతో గౌరవిస్తారని చెప్పారు. థర్డ్ జెండర్ అయినందుకు తాను ఏనాడు బాదపడలేదని ఐశ్వర్య చెప్పారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Bolstered by the Supreme Court ruling that consensual gay sex is not a crime, Odisha's first gazetted government officer from the transgender community plans to marry her live-in partner.The Supreme Court judgement on September 6 struck down IPC 377 Section and has paved the way for dignified living for LGBTQ (lesbian, gay, bisexual, transgender and queer) community.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more