వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త అధ్యక్షుడు వస్తారా - సీడబ్ల్యూసీ కీలక భేటీ : సంస్థాగత ఎన్నికలపైనా నిర్ణయం.!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో పరాభవం తరువాత కాంగ్రెస్ అత్యున్నత విధాయక మండలి సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ పరాజయం.. కొత్త అధ్యక్షుడు.. సంస్థాగతంగా ఎన్నికల నిర్వహణ పైన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో ఈ భేటీలో గాంధీ కుటుంబ ముఖ్యులు రాజీనామా చేస్తారంటూ తొలుత ప్రచారం సాగింది. కానీ, ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ ముఖ్యులు ఆ తరువాత ఖండించారు. ఈ సమావేశంలో అధ్యక్ష మార్పు పైన కీలకంగా చర్చ సాగే అవకాశం కనిపిస్తోంది.

అయిదు రాష్ట్రాల ఫలితాలతో డైలమా

అయిదు రాష్ట్రాల ఫలితాలతో డైలమా

అయితే, గాంధీ అనుయాయుల మాత్రం గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ లేదని.. వారి రాజీనామా అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత జీ -23 నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. తన గుండె నుంచి రక్తం కారుతోందంటూ సీనియర్ నేత ఆజాద్ వ్యాఖ్యానించారు. వారి సమావేశంలో పార్టీలో ముందు సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ మరో సారి తెర మీదకు తెచ్చారు. పూర్తి స్థాయి అధ్యక్షుడు పార్టీకి కావాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నారు. పంజాబ్ లో ఎన్నికలు ఓడిపోవటం వెనుక కారణాల పైన తొలుత విశ్లేషణ చేస్తున్నట్లుగా సమాచారం.

పూర్తి స్థాయి అధ్యక్షుడి నియామకం పై

పూర్తి స్థాయి అధ్యక్షుడి నియామకం పై

గతంలో జరిగిన సమావేశంలో తాను పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నానంటూ సోనియా ఒకింత సీరియస్ గా చెప్పుకొచ్చారు. ఈ సమావేశానికి సోనియా గాంధీతో పాటుగా ఖర్గే..అంబికా సోనీ, సల్మాన్ ఖుర్షీద్.. అజయ్ మకెన్, ప్రియాంక గాంధీ, చిదంబరం, అశోక్ గెహ్లాట్, భూపేష్ భగేల్, హరీష్ రావత్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే, ఈ సమావేశానికి నేతలు మొబైల్ ఫోన్లతో హాజరు కాకుండా సూచనలు చేసారు. జీ 23 నేతలు ముకుల్ వాస్నిక్ ను పార్టీ అధ్యక్షుడిగా నియమించాలనే సూచన చేసారంటూ ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారని రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ వ్యాఖ్యానించారు.

జీ 23 నేతల డిమాండ్లు.. సంస్థాగత ఎన్నికలు

జీ 23 నేతల డిమాండ్లు.. సంస్థాగత ఎన్నికలు


పార్టీలో జరగాల్సిన సంస్థాగత ఎన్నికలను షెడ్యూల్ కంటే ముందుగానే నిర్వహించే అంశం పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. గాంధీ కుటుంబం నుంచి కాకుండా.. ఇతరులకు ఎవరికైనా పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా.. లేక, ప్రస్తుత పరిస్థితుల్లో బాధ్యతల నుంచి దూరంగా ఉండకుండా.. రాహుల్ కే పార్టీ పటిష్ఠత బాధ్యతలు ఇస్తారా అనేది ఈ సమావేశంలో చర్చ..నిర్ణయం ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు..కేడర్ మాత్రం ఈ సమావేశంలో తీసుకొనే నిర్ణయాల పైన ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

English summary
Congress's highest executive authority CWC meeting after the poll debacle in 5 states is underway in Delhi. Congress chief Sonia Gandhi senior leader present.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X