మన యుద్ధ ట్యాంకులు ఇంతేనా? సత్తా చూపలేక విఫలమై అర్థంతరంగా వెనక్కు!
మాస్కో రీజియన్ లోని అల్బీనో రేంజ్ లో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ట్యాంక్ బైత్లాన్ నుంచి భారత్ అర్థంతరంగా నిష్క్రమించింది.
న్యూఢిల్లీ: మాస్కో రీజియన్ లోని అల్బీనో రేంజ్ లో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ట్యాంక్ బైత్లాన్ నుంచి భారత్ అర్థంతరంగా నిష్క్రమించింది. ఇండియాకు చెందిన రెండు యుద్ధ ట్యాంకుల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
ఈ ట్యాంక్ బైత్లాన్ రేసులో పలు దేశాల నుంచి వచ్చిన ట్యాంకులు తమ సత్తాను ప్రదర్శిస్తుండగా, ఇండియా నుంచి టీ-90 యుద్ధ ట్యాంకులు వెళ్లాయి. రెండు ట్యాంకులను భారత్ పంపగా, రెండింటిలోనూ సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి.
దీంతో రేసును పూర్తి చేయలేకపోవడంతో, విన్యాసాల నిర్వహణ అధికారులు ఇండియాపై అనర్హత వేటు వేశారు. దీంతో భారత ఆర్మీ ట్యాంకుల సిబ్బంది తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

తొలి రౌండ్ పోటీల్లో బలమైన ప్రత్యర్థిగా నిలిచిన భారత్ ఆ తరువాత మాత్రం తన స్థాయికి తగిన ప్రతిభను కనబరచలేకపోయింది. ఈ పోటీలో ఇండియా నిష్క్రమించిన తరువాత.. రష్యాతో పాటు బెలారుస్, కజకిస్థాన్, చైనా ట్యాంకులు ఫైనల్ రౌండుకు చేరుకున్నాయి.
చైనా దేశీయంగా తాను అభివృద్ధి చేసుకున్న టైప్ 96బీ ట్యాంకులతో ఈ పోటీ దిగగా, రష్యా కజకిస్థాన్ లు టీ-72బీ3 ట్యాంకులతో, బెలారుస్ టీ-72 రకం ట్యాంకులతో రంగంలోకి దిగాయి.
ఈ పోటీలో మొత్తం 19 దేశాల నుంచి వచ్చిన ట్యాంక్ టీంలు పోటీపడగా, తుది వరకూ భారత్ నిలవలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సెమీఫైనల్ దశలోనే భారత్ వెనుదిరగడంతో భారత్ యుద్ధ ట్యాంకుల సత్తాపై అనుమానాలు పెరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications