చిరు లాగే సూపర్ స్టార్‌కు చేదు, ఎర్రబడ్డ మొహం
కోల్‌కతా: చివరి దశ సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా 41 లోకసభ నియోజకవర్గాల్లో సోమవారం జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రముఖ నటుడు దేవ్‌కు ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి ఎదురైన చేదు అనుభవం ఎదురయింది.

మహిళ
పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తృణమూల్ కాంగ్రెసు, సిపిఎం కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డ ఓ మహిళ.

ఘర్షణ
పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తృణమూల్ కాంగ్రెసు, సిపిఎం కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డ ఓ వ్యక్తి. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

గాయాలు
పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బరంపురంలో తృణమూల్ కాంగ్రెసు, కాంగ్రెసు కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డ కాంగ్రెసు కార్యకర్త.

ఏచూరీ
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెసు పార్టీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని సిపిఎం నేత సీతారాం ఏచూరీ సోమవారం మండిపడ్డారు.

దేవ్ అధికారి
సూపర్ స్టార్ దేవ్ సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన ట్వీట్ చేశారు. తాను ఓటు వేశానని, మీరు కూడా వెళ్లి ఓటు వేయాలని సూచించారు.
సూపర్ స్టార్ దేవ్ క్యూలో కాకుండా నేరుగా వెళ్లి ఓటు వేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో క్యూలో నిలబడిన పలువురు ఓటర్లు ఆయనను వరుసలో రావాలని సూచించారు. దీంతో సూపర్ స్టార్ దేవ్ ఎర్రబడింది. అలాగే వాడిపోయింది. వరుసలో నిలబడి ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో తృణమూల్ కాంగ్రెసు, సిపిఎం, కాంగ్రెసు పార్టీల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/jTvgsnbSCWo?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications