ఎన్నికల్లో ఓటమి: నిలిచిన ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ అకౌంట్
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ అకౌంట్ పూర్తిగా నిలిచిపోయింది. ఆయన ట్విట్టర్ అకౌంట్‌లోకి వెళితే ‘‘కీప్ కామ్ కాజ్ ఐ విల్ బీ బ్యాక్'' అన్న పోస్టింగ్ మాత్రమే ఆయన ట్విట్టర్ పేజీలో దర్శనమిస్తోంది.
బుధవారం ఈ ట్వీట్ చేసిన తర్వాత మరే పోస్టింగ్ కూడా ఒమర్ అబ్దుల్లా చేయలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లా రెండు స్దానాల నుంచి బరిలోకి దిగారు. సోనావార్, బీర్వా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఆయన సోనావార్‌లో ఓటిపోయారు.
బీర్వా నియోజక వర్గంలో కూడా ముందు ఓడిపోయారని వార్తలు వచ్చినా.. ఆ తర్వాత స్వల్ప మోజారిటీ గెలుపొందారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఆయన పార్టీ నేషనల్ కాన్పరెన్స్ ఘోరంగా ఓడిపోవడం... పీడీపీ, భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా ఎక్కువ స్ధానాలు కైవసం చేసుకోవడంతో హాంగ్ ఏర్పడింది.

దీంతో జమ్మూ కాశ్మీర్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతుండటంతో... ఆయన తన ట్విట్టర్ ను అప్ డేట్ చేయడం మానేశారని తెలుస్తోంది. 87 అసెంబ్లీ స్ధానాలున్న జమ్మూ కాశ్మీర్‌లో పీడీపీ 28 స్ధానాలు గెలుచుకుని పెద్ద పార్టీగా అవతరించగా, బీజేపీ 25 స్ధానాలు గెలుచుకుని రెండో స్ధానంలో ఉంది.
ఒమర్ అబ్దుల్లాకు చెందిన నేషనల్ కాన్పరెన్స్ పార్టీ 15 స్ధానాలు, కాంగ్రెస్ పార్టీ 12 స్ధానాలను కైవసం చేసుకుంది. దీంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఏవైనా రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
దీంతో జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అన్ని పార్టీలతో సంప్రదిస్తామన్న బీజేపీ ప్రకటనకు ఆ రాష్ట్ర తాజా మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్పందించారు.
గురువారం ఉదయం ఆయన బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సహా ఆ పార్టీ కీలక నేత రామ్ మాధవ్‌లతో భేటీ అయ్యారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఐతే ఈ వార్తలను ఆ పార్టీ కార్యదర్శి రాంమాధవ్ ఖండించారు.
ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించిన మాధవ్, ఆ వార్తలు అవాస్తమని అన్నారు. కిడ్నీ మార్పిడి చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న తన తండ్రి ఫరూఖ్ అబ్దుల్లాను కలిసేందుకే ఒమర్ ఢిల్లీ వచ్చి వెళ్లనట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications