హైకోర్టు ఆగ్రహంతో రూటుమార్చిన కమల్ హాసన్...సారీ చెప్పకుండానే ఎమోషనల్ వివరణ..!
కన్నడ భాషకు తమిళ భాష తల్లి అంటూ తాను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో తన తాజా చిత్రం థగ్ లైఫ్ కు కర్నాటకలో ఆటంకాలు ఏర్పడటంతో హైకోర్టును ఆశ్రయించిన కమల్ హాసన్ కు షాక్ తగిలింది. చరిత్ర గురించి చెప్పడానికి మీరేమైనా చరిత్రకారుడా అంటూ కర్నాటక హైకోర్టు వేసిన ప్రశ్నకు కమల్ హాసన్ వద్ద జవాబు లేకుండా పోయింది. దీంతో తన వ్యాఖ్యలతో మనోభావాలు దెబ్బతిన్న వారికి సారీ చెప్పాలంటూ హైకోర్టు ఆయనకు సూచించింది.
ఈ నేపథ్యంలో కమల్ హాసన్ స్పందించారు. ఈ కేసు విచారణ జరుగుతుండగానే కర్నాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ)కి ఆయన లేఖ రాశారు. ఇందులోనూ ఆయన సారీ చెప్పలేదు. అయితే కన్నడ భాషపై తన వ్యాఖ్యల్ని అపార్థం చేసుకున్నారంటూ చెప్పుకొచ్చారు. థగ్ లైఫ్ సినిమా ఆడియో లాంచ్‌లో తన వ్యాఖ్యలు కన్నడ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబం పట్ల, ముఖ్యంగా శివ రాజ్‌కుమార్ పట్ల నిజమైన ప్రేమతో మాట్లాడినదని ఆయన వెల్లడించారు. వాటిని తప్పుగా అర్థం చేసుకున్నారని, అసందర్భంగా వాడుకోవడం బాధాకరమన్నారు.

తన మాటలు మనమందరం ఒకటేనని, ఒకే కుటుంబానికి చెందినవారమని, కన్నడను ఏ విధంగానూ తగ్గించకూడదని తెలియజేయడానికి మాత్రమే ఉద్దేశించి చేసినట్లు ఈ లేఖలో కమల్ తెలిపారు. కన్నడ భాష గొప్ప వారసత్వంపై ఎటువంటి వివాదం లేదా చర్చ లేదన్నారు.తమిళం మాదిరిగానే, కన్నడలో తాను చాలా కాలంగా ఆరాధించే గర్వించదగిన సాహిత్య , సాంస్కృతిక సంప్రదాయం ఉందన్నారు. కన్నడ పట్ల తనకున్న ప్రేమ ఎప్పుడూ నిజమైనదేన్నారు.
తన కెరీర్ మొత్తంలో, కన్నడ మాట్లాడే సమాజం తనపై చూపిన ఆప్యాయతను తాను ఎంతో గౌరవించానన్నారు. తాను స్పష్టమైన మనస్సాక్షి, నమ్మకంతో ఇలా చెబుతున్నానన్నారు. భాష పట్ల తనకున్న ప్రేమ నిజమైనదని, కన్నడిగులు తమ మాతృభాపపై కలిగి ఉన్న ప్రేమ పట్ల తనకు గొప్ప గౌరవం ఉందని కమల్ తెలిపారు. ఒక భాష మరొక భాషపై ఆధిపత్యం చెలాయించడాన్ని తాను ఎప్పుడూ వ్యతిరేకిస్తానన్నారు.
తమిళం, కన్నడ, తెలుగు, మలయాళంతో పాటు ఈ భూమిలోని అన్ని భాషలతో తన బంధం శాశ్వతమైనదని, హృదయపూర్వకంగా ఉందని కమల్ హాసన్ తెలిపారు. తాను ఎప్పుడూ అన్ని భారతీయ భాషల సమాన గౌరవం కోసం నిలబడతానని, ఏదైనా ఒక భాష మరొకదానిపై ఆధిపత్యం చెలాయించడాన్ని వ్యతిరేకిస్తానని పేర్కొన్నారు. ఎందుకంటే అలాంటి అసమతుల్యత భారత యూనియన్ యొక్క భాషా నిర్మాణాన్ని దెబ్బతీస్తుందన్నారు.

తనకు సినిమా భాష తెలుసునని, మాట్లాడతానని సినిమా అనేది ప్రేమ , బంధాన్ని మాత్రమే తెలిసిన సార్వత్రిక భాష అని తెలిపారు. తన ప్రకటన మనందరి మధ్య ఆ బంధం మరియు ఐక్యతను స్థాపించడానికి మాత్రమే అన్నారు. తన సీనియర్లు తనకు నేర్పిన ఈ ప్రేమ, బంధాన్నే పంచుకోవాలనుకున్నానన్నారు. తన కొడుకుగా భావించే శివ రాజ్ కుమార్ ను తన ప్రకటన కారణంగా వివాదంలోకి లాగడం పట్ల కమల్ హాసన్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రేమ, బంధం నుండే శివన్న ఆడియో లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారన్నారు. దీని కారణంగా శివన్న ఇంత ఇబ్బంది పడాల్సి వచ్చినందుకు నిజంగా చింతిస్తున్నానన్నారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications