NCERT సిలబస్ లో వివాదాస్పద కోతలపై నిరసన- తమ పేర్లూ తీసేయాలన్న సలహాదారులు..
జాతీయ విద్యా పరిశోధక మండలి ఎన్సీఈఆర్టీ తాజాగా కరోనా తర్వాత విద్యార్ధులపై ఒత్తిడి తగ్గింపు పేరుతో పాఠ్యపుస్తకాల్లో సిలబస్ లో మార్పులు చేస్తోంది. ఇదే క్రమంలో చారిత్రకంగా కీలకమైన చాలా పాఠ్యాంశాల్ని సిలబస్ నుంచి తొలగిస్తోంది. దీనిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్టీఈఆర్టీ తీరుకు నిరసనగా సిలబస్ సలహాదారులుగా ఉన్న ఇద్దరు విద్యానిపుణులు యోగీంద్ర యాదవ్, సుహాస్ పాల్షీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
పాఠశాల పాఠ్యపుస్తకాల్లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇటీవల చేసిన అహేతుకమైన తొలగింపులను ఆక్షేపిస్తూ 9 నుండి 12 తరగతులకు రాజకీయ శాస్త్ర పుస్తకాలకు ముఖ్య సలహాదారులుగా ఉన్న సుహాస్ పల్షికర్ , యోగేంద్ర యాదవ్ తమ పేర్లను కూడా తీసేయాలని కోరారు. వాస్తవానికి 2006-07లో ప్రచురించిన ఈ పాఠ్యపుస్తకాల నుండి తమను తప్పించాలని కోరుతూ కౌన్సిల్‌కు వీరిద్దరూ లేఖలు రాశారు.

కోవిడ్-19 అంతరాయాల నుండి విద్యార్థులు కోలుకోవడానికి పాఠ్యాంశాలను తగ్గించే సాకుతో గతేడాది నుంచి కౌన్సిల్ భారీ మార్పులు, తొలగింపులను చేపడుతోంది. వీటిపై విమర్శలు వెల్లువెత్తడంతో వివాదాస్పదంగా మారాయి. ఈ మార్పులలో 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన అన్ని అంశాల్ని తొలగించడం, మొఘల్ శకం, కుల వ్యవస్థకు సంబంధించిన కంటెంట్‌ను తగ్గించారు. అలాగే నిరసనలు మరియు సామాజిక ఉద్యమాలపై అధ్యాయాలను కూడా తొలగించారు.
హేతుబద్ధీకరణ ప్రక్రియ సమగ్రతపై ఆందోళనలను వ్యక్తంచేస్తూ యాదవ్, పల్షికర్ NCERT డైరెక్టర్ డీఎస్ సక్లానీకి లేఖ రాశారు. ఇందులో కౌన్సిల్ నిర్ణయాల్లో బోధనాపరమైన హేతుబద్ధత కనిపించడం లేదని ఆరోపించారు. ఈ మార్పుల వెనుక దురుద్దేశాలున్నాయని వారు పరోక్షంగా విమర్శించారు. ఏదైనా టెక్స్ట్‌లో అంతర్గత తర్కం ఉంటుందని, అలాంటి ఏకపక్ష కోతలు, తొలగింపులు టెక్స్ట్ స్ఫూర్తిని ఉల్లంఘిస్తాయని తాము నమ్ముతున్నట్లు వారు పేర్కొన్నారు. ఇలాంటి వరుస తొలగింపులు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను సంతోషపెట్టడానికే తప్ప వీటిలో ఎటువంటి లాజిక్ లేదన్నారు.












Click it and Unblock the Notifications