ముస్లిం రిజర్వేషన్ల రద్దు : కర్నాటకలో బీజేపీ విఫల ప్రయోగం తెలంగాణలో ఫలిస్తుందా ?

కర్నాటకలో వచ్చే నెలలో ఎన్నికలు ఎదుర్కొంటున్న బీజేపీ.. నాలుగుశాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి వక్కళిగలు, లింగాయత్ లకు రెండేసి శాతం చొప్పున పంచేసింది. ఈ నిర్ణయంపై కర్నాటకలో నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఎన్నికల వేళ ఒక్కోవర్గాన్ని చేరదీసి, ఓటర్లుగా మార్చుకునేందుకు ప్రయత్నించాల్సిన తరుణంలో బీజేపీ చర్యలు విమర్శలకు తావిస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణలో సైతం అదే హామీ ఇస్తూ నిన్న అమిత్ షా చేసిన ప్రకటన చర్చకు దారి తీసింది.

కర్నాటక అయినా మరే రాష్ట్రంలో అయినా ముస్లిం రిజర్వేషన్ల కల్పనలో బీజేపీ పాత్ర లేదు. అంతే కాదు వాటిని వ్యతిరేకించిన చరిత్ర కూడా బీజేపీకి ఉంది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వల్లో, మెజారిటీ వల్లో ఆయా రాష్ట్రాల్లో వాటిని రద్దు చేసేందుకు బీజేపీ కదులుతోంది. కర్నాటకలో బీజేపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ముస్లిం రిజర్వేషన్ల రద్దు కోసం డిమాండ్లు వచ్చినా స్పందించకుండా మౌనంగా ఉంది. కానీ ఇప్పుడు అధికారం నిలబెట్టుకునేందుకు వాటిని రద్దు చేసేసింది.

 why amit shah continue muslim reservations cancellation plan in ?

ఇప్పుడు తెలంగాణలో సైతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా ప్రకటించారు. దీంతో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైఎస్సార్ హయాంలో ఉమ్మడి ఏపీలో కల్పించిన ముస్లిం రిజర్వేషన్ల ప్రయోజనాలు ఇప్పటికీ అక్కడి ముస్లింలు అందుకుంటన్నాయి. అదే సమయంలో తెలంగాణలో మత ప్రాతిపదిక విభజన తెచ్చి ప్రయోజనం పొందేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ల రద్దు ప్రకటన చేశారనే వాదన వినిపిస్తోంది.

కర్నాటకలో ముస్లిం రిజర్వేషన్ల రద్దు తర్వాత అక్కడి మైనార్టీ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అలాగే తటస్ధుల్లోనూ దీనిపై వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై దీని ప్రభావం పడబోతోందని వివిధ సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో కర్నాటకకు పొరుగున ఉన్న తెలంగాణలోనూ ఈ ప్రకటన చేయడం ద్వారా బీజేపీ పెద్ద సాహసమే చేసిందనే చర్చ జరుగుతోంది. కర్నాటకలో ఈ కారణంగా రేపు ఓడిపోతే దాని ప్రభావం తెలంగాణపైనా పెద్ద ఎత్తున పడే ప్రమాదముందన్న వాదన కూడా వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+