• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

PFI బ్యాన్-దాంతో పాటే RSS బ్యాన్ డిమాండ్లు-గతంలోనూ 3సార్లు నిషేధం..

|
Google Oneindia TeluguNews

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తో పాటు మరో ఏడు సంస్ధలపై కేంద్రం ఇవాళ కొరడా ఝళిపించింది. ఐదేళ్ల పాటు ఆయా సంస్ధల్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీన్ని కాంగ్రెస్ సహా పలు విపక్షాలు స్వాగతిస్తూనే ఆరెస్సెస్ పైనా ఇలాంటి నిషేధమే విధించాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో చరిత్రలో ఆరెస్సెస్ పై నిషేధం విధించిన సందర్భాల్ని ఓసారి తెలుసుకుందాం..

1925లో కాంగ్రెస్‌ సభ్యుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఏర్పాటు చేసిన ఆరెస్సెస్.. 'సాంస్కృతిక' సంస్థగా ఎదిగినా 1948, 1975 మరియు 1992లో మూడుసార్లు నిషేధాలను ఎదుర్కొంది. మహాత్మా గాంధీ హత్య తర్వాత 1948 లో ఆరెస్సెస్ పై నిషేధం విధించారు.ఫిబ్రవరి 4, 1948న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేతృత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రభుత్వ ప్రకటనలో "మన దేశంలో పని చేస్తున్న ద్వేషం, హింసాత్మక శక్తులను నిర్మూలించడానికి ,ప్రజల స్వేచ్ఛను దెబ్బతీసేందుకు ప్రయత్నించినందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధిస్తున్నట్లు పేర్కొంది.

సంఘ్ సభ్యులు అవాంఛనీయ,ప్రమాదకరమైన కార్యకలాపాలను కూడా చేపట్టారు. దేశంలోని అనేక ప్రాంతాలలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లోని సభ్యులు దహనం, దోపిడీ, దోపిడీ హత్యలతో కూడిన హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని అక్రమ ఆయుధాలు మందుగుండు సామగ్రిని సేకరించినట్లు గుర్తించారు. చివరికి ఆరెస్సెస్ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదనే షరతుతో పటేల్ నిషేధం ఎత్తేశారు. దీంతో జన్ సంఘం పుట్టుకొచ్చింది.

after PFI ban in india, now RSS ban demands also- what happened to Sangh in Past ?

రెండోసారి ఇందిరాగాంధీ విధించిన 1975 ఎమర్జెన్సీ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలు తగ్గించేందుకు నిషేధం విధించారు. అయితే ఇది రాజకీయ కారణాలతో తీసుకున్న నిర్ణయంగా విమర్శలు ఎదుర్కొంది. 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత మరో నిషేధం విధించారు. ప్రధాని పీవీ నరసింహారావు, ఆయన హోంమంత్రి శంకర్‌రావు బల్వంతరావు చవాన్‌లు నిషేధం విధించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ,జమాతే ఇస్లామీ హింద్,స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియాలను నిషేధించింది. అయితే ప్రభుత్వం దానిని కేంద్ర ట్రిబ్యునల్ ముందు సమర్ధించుకోవడంలో విఫలమైంది. 2018లో ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ 'కాంగ్రెస్-ముక్త్ భారత్' వంటి నినాదాలు కేవలం రాజకీయ నినాదాలు మాత్రమేనని స్ఫష్టం చేశారు. అది ఆరెస్సెస్ భాష కాదన్నారు.

English summary
After central govt's ban on popular front of india for five years, now opposition parties demands rss ban too.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X