తల్లికి పిండం పెట్టడానికి వెళ్లిన కొడుకు జలసమాధి. అసలు ఏం జరిగింది !

బెంగళూరు/మంగళూరు: ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతారో అనే వియషం అంతుచిక్కదు అనే విషయం తెలిసిందే. తల్లి చనిపోవడంతో ఆయన కుమారుడు ఆవేదనతో ఉన్నాడు. సాంప్రధాయం ప్రకారం తల్లి చనిపోయిన తరువాత చెయ్యవలసిన కార్యక్రమాలు కొడుకు చేస్తున్నాడు. అయితే తల్లికి పిండప్రధానం చెయ్యడానికి వెళ్లిన కొడుకు కూడా జలసమాధి అయ్యాడు.

తల్లికి పిండ ప్రదానం చేసేందుకు వెళ్లిన కుమారుడు చెరువులో పడి మృతి చెందిన సంఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని కోటలో చోటుచేసుకుంది. గణేష్ (76) అనే ఆయన అతని అమ్మ చనిపోవడంతో వారి కులం సాంప్రధాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. సాయంత్రం 5.30 గంటలకు సంప్రదాయం ప్రకారం గణేష్ ఆయన తల్లికి పిండ ప్రధానం చెయ్యడానికి ఇంటి సమీపంలోని చెరువులోకి వెళ్లాడు.

deadbody5

పిండప్రధానం చెయ్యడానికి వెళ్లి గంటలు అయినా గణేష్ ఇంటికి రాకపోవడంతో ఆయన కొడుకు వెళ్లి చూడగా సరస్సులో మృతదేహం తేలాడుతోంది. పిండప్రధానం చెయ్యడానికి వెళ్లిన గణేష్ ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మునిగిపోయి ఊపిరాడక మృతి చెందినట్లు కోట పోలీసులు తెలిపారు. కోట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఒకే ఇంటిలో తల్లితో పాటు కొడుకు కూడా చనిపోవడంతో ఆ ఇంటిలో విషాదచాయలు నెలకొన్నాయి.

దక్షిణ కన్నడ జిల్లాలోని ముల్కి పట్టణంలోని పడుపనంబూరులోని సంతకట్టెబలి వద్ద పుష్పరాజ్ అమీన్ ఇంటి వెనుక ఉన్న డ్రైనేజీ గుంతలో అనుమానాస్పదంగా కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. పాణంబూరు, పాడు కల్లాపు నాగమ్మ మృతి చెందారు. నాలుగు నెలలుగా కనిపించకుండా పోయిన మహిళ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. కేసు విచారణలో ఉంది. మహిళను హత్య చేసి డ్రైనేజ్ లో వేసి ఉంటారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+