Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..!

ఇరాన్ పై ఏకపక్షంగా దాడులు మొదలుపెట్టి..ఆ తర్వాత ఎదురవుతున్న అనుభవాలతో ఇవాళ యుద్దానికి తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) చేసిన ప్రకటన ప్రపంచ దేశాల్ని ఆశ్చర్య పరిచింది. ట్రంప్ ప్రకటనపై పలు దేశాలు స్పందిస్తున్నాయి. అమెరికా మిత్రదేశాలు ఈ ప్రకటనను స్వాగతించాయి. అలాగే భారత్ కూడా ఇరాన్ యుద్ధం ఆపాలన్న ట్రంప్ నిర్ణయంపై స్పందించింది.

ఇరాన్ యుద్దం విషయంలో ట్రంప్ ఇవాళ చేసిన ప్రకటనపై భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ స్పందించారు. ఇవాళ విదేశాంగశాఖ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై తలపెట్టిన సైనిక దాడులను ఐదు రోజులు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో, భారత్ పరిణామాలను నిశితంగా గమనిస్తోందని తెలిపారు. అయితే అంతకు మించి దీనిపై మాట్లాడలేదు.

After Trump Postpones Iran Strikes MEA Confirms India Is Closely Watching US Moves

మరోవైపు ఇవాళ మధ్యాహ్నం పశ్చిమాసియా ఉద్రిక్తతలపై లోక్ సభలో మాట్లాడిన ప్రధాని మోడీ.. దీర్ఘకాలిక ప్రభావాలకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దీనిపై చర్చ జరుగుతుండగానే ట్రంప్ ప్రకటన వెలువడింది. దీంతో భారత్ కూ భారీ ఊరట లభించినట్లయింది. ఎందుకంటే ఇప్పటికే హార్ముజ్ జలసంధిలో ఆటంకాల నేపథ్యంలో చమురు నౌకలు భారత్ కు రావడం ఆలస్యమవుతోంది. ఇతర దేశాల తరహాలో ఆంక్షలు లేకపోయినా ట్రాఫిక్, ఇతర సమస్యలతో నౌకల ఆలస్యం దేశంలో చమురు, గ్యాస్ కొరతకు కారణమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+