దీపావళి బంపర్ ఆఫర్...! ఫ్రీగా టోల్ గేట్ ఎత్తేశారు...!

ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వేపై ఆదివారం సాయంత్రం ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. దీపావళి సందర్భంగా ఏటా ఉద్యోగులకు కంపెనీలు స్వీట్లు, బోనస్ లు ఇస్తుంటాయి. కానీ ఈ ఎక్స్ ప్రెస్ హైవేపై ఉన్న టోల్ గేట్ నిర్వహిస్తున్న కాంట్రాక్టు సంస్ద మాత్రం తమ ఉద్యోగులకు బోనస్ ఇవ్వలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సిబ్బంది టోల్ గేట్లు ఎత్తేసి తమ నిరసన తెలిపారు. సాధారణంగా ఫాస్టాగ్ స్కాన్ తర్వాత ఎత్తేసే టోల్ గేట్లు నేరుగా ఎత్తేయడంతో వాహనదారులు పండగ చేసుకున్నారు.

ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వేపై ఫతేహాబాద్ టోల్ ప్లాజా ఉంది. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ఈసారి దీపావళికి కాంట్రాక్టు సంస్థ బోనస్ ఇచ్చేందుకు నిరాకరించింది. పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో ఉసూరుమంటూ దీపావళి జరుపుకోవాల్సి వచ్చింది. దీనిపై ఆగ్రహంగా ఉన్న సదరు టోల్ ప్లాజా సిబ్బంది ఓ నిర్ణయానికి వచ్చారు. తమ సంస్థకు ఆదాయం తెచ్చిపెడుతున్న టోల్ గేట్ ను కాస్తా ఎత్తేసి ఉచితంగా వాహనాలను వదిలేశారు. దీంతో వేలాది వాహనాలు ఉచితంగానే ఈ టోల్ గేట్ క్రాస్ చేసి వెళ్లిపోయాయి.

Agra-Lucknow Expressway Goes Toll-Free for Diwali After Bonus Disappointment

ఈ ఘటనపై విచారణ జరిపితే సిబ్బంది షాకింగ్ వాస్తవాలు బయటపెట్టారు. ఈ టోల్ ప్లాజాలో ఏడాదిగా తాము పనిచేస్తున్నామని, అయినా తమకు దీపావళి సందర్భంగా బోనస్ ఇవ్వలేదని, అలాగే జీతాలు కూడా సమయానికి ఇవ్వడం లేదని ఆరోపించారు. గట్టిగా అడిగితే తమను సాగనంపి కొత్త ఉద్యోగులను తెచ్చుకుంటామని యాజమాన్యం చెప్పినట్లు వారు ఆరోపిస్తున్నారు. ఎంత కష్టపడుతున్నా తమకు బోనస్ ఇవ్వకపోవడం, జీతాలు సకాలంలో ఇవ్వకపోవడంతోనే ఇలా చేసినట్లు చెప్తున్నారు.

Agra-Lucknow Expressway Goes Toll-Free for Diwali After Bonus Disappointment

మొత్తం మీద సిబ్బంది చేసిన పనికి సదరు టోల్ ప్లాజా నుంచి రావాల్సిన లక్షల రూపాయల ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా కోల్పోయినట్లయింది. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. సంస్థ కోసం నిజాయితిగా పనిచేస్తున్న ఉద్యోగులను కనీసం దీపావళి బోనస్ కూడా ఇవ్వకుండా వేధించడం సరికాదని కొందరు అంటుంటే, బోనస్ ఇవ్వకపోతే ఇలా టోల్ గేట్లు తెరిచేసి సంస్థకు నష్టం చేస్తారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+