వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలపరీక్ష నెగ్గిన ఫడ్నవీస్, వ్యతిరేకంగా సేన ఓటు

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి్ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం శాసనసభలో బలపరీక్ష నెగ్గింది. మూజువాణీ ఓటుతో ప్రభుత్వం గట్టెక్కింది. ఎన్సీపి మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వానికి సమస్య ఎదురు కాలేదు. శివసనే ప్రబుత్వానికి వ్యతిరేకంగా ఓటేసింది.

పూణేకు చెందిన ఎంఎన్ఎస్ ఏకైక శాసనసభ్యుడు బిజెపి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. బలపరీక్షకు ముందు శివసేన నేతలు రాందాస్ కదం, దివాకర్ రోటే ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ను కలిశారు.

మహారాష్ట్రలో ప్రభుత్వానికి అనుకూలంగా శివసనే ఓటేయకపోతే మంచిది కాదని బిజెపికి చెందిన సుబ్రహ్మణ్య స్వామి అన్నారు.

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శాసనసభకు వచ్చారు.

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వానికి బలపరీక్షలో మద్దతు ఇస్తామని ఎన్సిపీ ప్రకటించింది. మహారాష్ట్రలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఖాయం చేయడమే తమ ఉద్దేశమని ఎన్సీపి అధికార ప్రతినిధి డిపి త్రిపాఠీ చెప్పారు.

సమస్యను తర్వాత పరిష్కరించుకోవచ్చునని, శివసేన ప్రభుత్వ విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలని మహారాష్ట్ర విద్యామంత్రి వినోద్ తవ్డే అన్నారు.

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బిజెపి మైనారిటీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయకూడదని శివసేన నిర్ణయించుకుంది. సీనియర్ శివసేన నేత ఒకరు ఈ విషయం చెప్పారు. ఫడ్నవీస్ ప్రభుత్వం బుధవారం సాయంత్రం బలపరీక్షను ఎదుర్కోనుంది. విశ్వాస పరీక్షలో నెగ్గడానికి అవసరమైన బలం బిజెపికి లేదు. దీంతో ఇతర పార్టీల మద్దతు అవసరం. ఈ స్థితిలో శివసేన బిజెపికి అనుకూలంగా ఓటు వేయకూడదని శివసేన నిర్ణయించుకుంది.

గత రాత్రి కొత్తగా చర్చలేవీ జరగలేదని, బిజెపికి అనుకూలంగా తాము ఓటు వేయడం లేదని శివసేనకు చెందిన రాందాస్ కదమ్ బుధవారం ఉదయం చెప్పారు. స్పీకర్ పదవికి కాంగ్రెసు, శివసేనలు కూడా నామినేషన్ దాఖలు చేశాయి. అయితే, కాంగ్రెసు పోటీ నుంచి విరమించుకుంది. శివసేన కూడా తన అభ్యర్థిని ఉపసంహరించుకుంది. బిజెపి అభ్యర్థి హరిబాబు బగ్డేకు మద్దతు ఇవ్వాలని ఉద్ధవ్ థాకరే నిర్ణయించుకున్నారు.

Ahead of Maharashtra Trust Vote, Shiv Sena Says Will Not Vote in Favour of BJP

శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపిని ఎలుకగా అభివర్ణిస్తూ బిజెపి ఆ ఎలుక సాయంతో బలపరీక్షలో నెగ్గవచ్చునని శివసేన నాయకులు అన్నారు. ఎన్సీపిని మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారని, బిజెపి ఎన్సీపి మద్దతు తీసుకుంటే ప్రజల తీర్పును అగౌరవపరచడమే అవుతుందని వారన్నారు.

తమ పార్టీ బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేస్తుందని శివసేన నాయకుడు రాందాస్ కదం చెప్పారు. గత నెల రోజులుగా తాము చాలా ప్రయత్నాలు చేశామని, బిజెపి మారలేదని ఆయన అన్నారు. ప్రతిపక్షంలో కూర్చుందామని తమ పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే చెప్పినట్లు ఆయన తెలిపారు.

శివసేనతో తెగతెంపులు

ప్రతిపక్షంలో కూర్చుంటామని శివసేన బుధవారం మరోసారి స్పష్టం చేసింది. ఫడ్నవీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని తెలిపింది.

మహారాష్ట్ర స్పీకర్‌గా హరిభావ్ భాగ్డే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

English summary
As BJP seeks the vote of confidence in Maharashtra assembly today afternoon, Shiv Sena has warned it will vote against the new government and sit in the opposition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X