పీఓకేలో 4ఉగ్రవాద స్థావరాల ధ్వంసం: 2016 సర్జికల్ స్ట్రైక్స్ తాజా వీడియో ఇదే

న్యూఢిల్లీ/శ్రీనగర్: 2016లో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌(పీఓకే)లోని పలు ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు(సర్జికల్‌ స్ట్రైక్స్‌) జరిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారత్‌పై ఉగ్రదాడులకు సిద్ధం చేసిన నాలుగు 'టెర్రర్‌ లాంచ్‌ పాడ్‌'లను భారత సైన్యం ధ్వంసం చేసింది.

కాగా, ఈ సర్జికల్‌ స్ట్రైక్స్‌లో దాదాపు 50 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను నరేంద్ర మోడీ ప్రభుత్వం గత జూన్‌లో బహిర్గతం చేసింది. సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగి శుక్రవారం(సెప్టెంబరు 28)కి రెండేళ్లు పూర్తి కానున్న సందర్భంగా గురువారం మరో వీడియోను విడుదల చేసింది.

Ahead of second anniversary, new video evidence of 2016 Surgical strike emerges

కాశ్మీర్‌ బారాముల్లాలోని ఉడి సైనికస్థావరంలోకి చొరబడిన ఉగ్రవాదులు 18 మంది భారత సైనికులను హతమార్చారు. దీనికి ప్రతీకారంగా సరిగ్గా 11 రోజుల తర్వాత భారత సైనికులు మెరుపుదాడుల ద్వారా సత్తా చాటారు. 2016 సెప్టెంబర్‌ 28వ తేదీ అర్థరాత్రి, 29వ తెల్లవారు జాములోగా ముగించిన ఈ దాడులకు సంబంధించిన నాలుగు వీడియోలున్నాయి.

జమ్మూ రీజియన్‌లో నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంబడి భద్రతను పర్యవేక్షించే 15 దళాలకు అధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) రాజేంద్ర నింబోర్కర్‌ వ్యవహరించారు. సర్జికల్‌ దాడులకు ప్రణాళిక రచించడంలో ఆయనే కీలక పాత్ర పోషించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+